భారత్‌ ‌చేరుకున్న రష్యా అధ్యక్షుడు పుతిన్‌

– ఘనంగా స్వాగతం పలికిన ప్రధాని మోదీ
– ఇరువురు నేతలు కలసి ప్రధాని నివాసానికి చేరిక
– రేపు పలు కీలక ఒప్పందాలపై సంతకాలు

న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, డిసెంబరు4: రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ‌భారత్‌కు చేరుకున్నారు. దిల్లీ సమీపంలోని ఎయిర్‌ఫోర్స్ ‌స్టేషన్‌లో దిగిన ఆయనకు ప్రధాని మోదీ స్వయంగా స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి ఇద్దరు నేతలు ఒకే కారులో ప్రధాని అధికారిక నివాసానికి ప్రయాణమయ్యారు. ఉక్రెయిన్‌ ‌యుద్ధం ప్రారంభమైన తర్వాత తొలిసారిగా రెండు రోజుల పాటు ఇండియా పర్యటనకు వొచ్చారు. ప్రధాని నరేంద్రమోదీ ఆయనను స్వయంగా ఎయిర్‌పోర్ట్‌లో స్వాగతించారు. పుతిన్‌ 23‌వ ఇండియా-రష్యా శిఖరాగ్ర సమావేశంలో పాల్గొననున్నారు. రెండు దేశాల మధ్య రక్షణ, వాణిజ్య రంగాలలో పలు కీలక ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. ఉక్రెయిన్‌ ‌యుద్ధం ప్రారంభానికి కొన్ని నెలల ముందు 2021 డిసెంబరులో పుతిన్‌ ‌చివరిసారి దిల్లీలో పర్యటించారు. ఆ తర్వాత ఆయన మన దేశానికి రావడం ఇదే తొలిసారి. రష్యా చమురు కొనుగోలు చేస్తోందన్న కారణంతో భారత్‌పై అమెరికా అదనపు సుంకాలు అమలు చేస్తున్న వేళ ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.పుతిన్‌ ‌కు ప్రధాని మోదీ ప్రైవేటు విందు ఇవ్వనున్నట్లు సమాచారం. శుక్రవారం ఇరునేతలు ఇండియా-రష్యా 23వ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా పలు రక్షణ, వాణిజ్య ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. భారత్‌తో సంబంధాలు, సహకారాన్ని మరింత పెంపొందించుకోవడానికి రష్యా ఎదురు చూస్తోందని పుతిన్‌ ఇప్పటికే తెలిపారు. ఇంధనం, పరిశ్రమలు, అంతరిక్షం తదితర రంగాల్లో అనేక ఉమ్మడి ప్రాజెక్టులు పూర్తి చేసుకోవడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. భారత్‌ ‌నుంచి దిగుమతులు మరింత పెంచుకునే అంశంపైనా చర్చలు జరపనున్నట్లు వెల్లడించారు. గురువారం  వ్లాదిమిర్‌ ‌పుతిన్‌ ‌పాలం వైమానిక దళ స్టేషన్‌లో దిగగా ప్రధాని మోదీ ఆయనకు స్వాగతం పలికారు. శుక్రవారం ఉదయం 11.00: పుతిన్‌ ‌రాష్ట్రపతిని కలిసేందుకు రాష్ట్రపతి భవన్‌కు వెళతారు. ఉదయం 11.30కు రాజ్‌ఘాట్‌ ‌వద్ద నివాళి అర్పిస్తారు.ఉదయం 11.50: నరేంద్ర మోదీతో సమావేశం.మధ్యాహ్నం 1.50: హైదరాబాద్‌ ‌హౌస్‌లో సంయుక్త విలేకరుల సమావేశం ఉంటుంది. సాయంత్రం 7.00 గంటలు: పుతిన్‌ ‌రాష్ట్రపతి భవన్‌కు వెళ్లి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశం అవుతారు.రాత్రి 9.00 గంటలకుఆయన తన పర్యటనను ముగించుకుని భారతదేశం నుండి బయలుదేరుతారు. పుతిన పర్యటన సందర్భంగా ఢిల్లీలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *