రష్యాలో కుప్పకూలిన సైనిక విమానం

– 29మంది దుర్మరణం చెందినట్లు ధ్రువీకరణ

మాస్కో, ఏప్రిల్‌ 1: ‌క్రిమియాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. రష్యాకు చెందిన సైనిక విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో 29 మంది దుర్మరణం చెందారు. ఆంటోనోవ్‌- 26 ‌మోడల్‌కు చెందిన విమానం స్థానిక కాలమాన ప్రకారం  మంగళవారం సాయంత్రం 6 గంటలకు క్రిమియా ద్వీపకల్పం మీదుగా వెళ్తోంది. అదే సమయంలో ఆ విమానానికి రాడర్‌తో సంబంధాలు తెగిపోయాయి. అయితే ఆ విమానం ఒక కొండను ఢీకొని కూలిపోయినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో విమానంలో 23 మంది సైనికులు, ఆరుగురు సిబ్బంది ఉండగా వారందరూ మృతిచెందారని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సాంకేతిక సమస్య కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని ప్రాథమిక అంచనా వేసింది. విమానంపై దాడి జరిగింది అనడానికి ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేసింది. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకునేందుకు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపింది. ప్రమాదానికి గురైన ఆంటోనోవ్‌ ఎన్‌- 26 ‌విమానాలను 1960 చివరలో ప్రవేశపెట్టారు. వీటిని సైనిక అవసరాలతో పాటు సరకు రవాణాకు ఉపయోగిస్తుంటారు. అయితే ఈ మోడల్‌కు చెందిన విమానాలు గత కొన్నేళ్లుగా ప్రమాదాలకు గురవుతున్నాయి. ఇదే ఏడాది దక్షిణ సూడాన్‌లో జరిగిన ప్రమాదంలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. 2022లో ఉక్రెయిన్‌లో జరిగిన ప్రమాదంలో ఒకరు మృతిచెందగా 2020లో శిక్షణ విమానం కూలి 20 మంది మరణించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *