– కిటకిటలాడుతున్నజూబ్లీ బస్ స్టాండ్
హైదరాబాద్,ప్రజాతంత్ర,సెప్టెంబర్29: దసరా పండగకు స్వగ్రామాలకు వెళ్లే ప్రయాణికులతో జూబ్లీ బస్టాండ్ జేబీఎస్ కిటకిటలాడుతోంది. నగరవాసులు కుటుంబ సమేతంగా ప్లలెలకు బయలుదేరి వెళ్తున్నారు. ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది. మరోవైపు ఎంజీబీఎస్ బస్టాండ్, సికింద్రాబాద్, రైల్వే స్టేషన్లలోనూ ప్రయాణికుల రద్దీ నెలకొంది. పండగ నేపథ్యంలో మరికొన్ని రోజులు ఈ రద్దీ కొనసాగే పరిస్థితులున్నాయి. మరోవైపు ప్రైవేటు, సొంత వాహనాల్లోనూ పెద్దఎత్తున గ్రామాలకు వెళ్తున్నారు. దీంతో నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. పలు ప్రాంతాల నుంచి ఆర్టీసీ బస్సులను నడుపుతున్నారు. దీంతో నగరంలో ఆయా ప్రాంతాలకు చేరుకునేందకు ప్రజలు నానా హైరానా పడ్డారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





