గ్రామీణాభివృద్ధి, చిన్నారుల సంక్షేమానికి ప్రాధాన్యం

– మంత్రులు భట్టి, సీతక్కల ఆధ్వర్యంలో ప్రీ-బడ్జెట్ సమావేశం

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 10: కోట్లాది ప్రజలతో ప్రత్యక్ష సంబంధం కలిగిన శాఖలు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పంచాయతీరాజ్ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్కలు పేర్కొన్నారు. ఈ క్రమంలో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, మహిళలు, చిన్నారుల సంక్షేమం కోసం ఈ శాఖలకు బడ్జెట్‌లో ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు. రాబోయే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ప్రతిపాదనలపై భట్టి విక్రమార్క, సీతక్కల ఆధ్వర్యంలో ప్రీ బడ్జెట్ సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఆయా శాఖల ఉన్నతాధికారులు హాజరై బడ్జెట్ ప్రతిపాదనలపై సమగ్రంగా చర్చించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ గ్రామాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు. ప్రతి గ్రామంలో గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణం, అంగన్‌వాడీ కేంద్రాలు, మహిళా భవనాల నిర్మాణం వంటి అంశాలకు బడ్జెట్‌లో ప్రత్యేక కేటాయింపులు చేయనున్నామన్నారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో మెరుగైన సేవలు అందేలా అవసరమైన నిధులు సమకూర్చే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. చిన్నారుల ఆరోగ్యం, పోషకాహారం, సమగ్ర అభివృద్ధి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంగా తీసుకుంటున్న అంశాలని మంత్రులు స్పష్టం చేశారు. ముఖ్యంగా చిన్నారుల సంక్షేమం, పోషకాహార కార్యక్రమాల అమలుకు గత ఏడాది బడ్జెట్‌తో పోలిస్తే మరింత ఎక్కువ నిధులు కేటాయించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇంటిగ్రేటెడ్ పాఠశాలలతో అనుబంధంగా కొత్త అంగన్‌వాడీ కేంద్రాల నిర్మాణం చేపట్టాలని అధికారులకు సూచించారు. చిన్నారుల విద్య, పోషణ, సంరక్షణ ఒకే వేదికపై అందేలా ఈ కేంద్రాలను అభివృద్ధి చేయడం ప్రభుత్వ లక్ష్యమన్నారు. అలాగే ఉపాధి హామీ పథకానికి కేంద్ర ప్రభుత్వం కోతలు విధిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆ లోటును భర్తీ చేసే దిశగా చర్యలు తీసుకుంటుందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు తగ్గకుండా ఉండేలా రాష్ట్రం నుంచి అవసరమైన నిధులు కేటాయించి పథకం అమలు కొనసాగేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. గ్రామీణాభివృద్ధి, మహిళా సాధికారత, చిన్నారుల సంక్షేమం రాష్ట్ర అభివృద్ధికి బలమైన పునాది అని పేర్కొన్నారు. ప్రజల అవసరాలకనుగుణంగా ఆయా శాఖలకు బడ్జెట్ కేటాంపులుంటాయని మంత్రులు తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *