మరింతగా క్షీణించిన రూపాయి

– కనిష్ఠ స్థాయికి పడిపోయిన మార‌కం విలువ‌

ముంబై, డిసెంబర్‌ 3: అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ కనిష్ఠ స్థాయికి పడిపోయింది. ఉదయం ట్రేడిరగ్‌లో 6 పైసలు తగ్గి చరిత్రలో తొలిసారిగా 90.02కి చేరుకుంది. గ్రీన్‌బ్యాక్‌తో పోలిస్తే 89.96 వద్ద ప్రారంభమైన రూపాయి రికార్డు స్థాయిలో 90.15కి చేరుకుంది. ఆ తరువాత కొంత కోలుకుని 90.02 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇది దాని మునుపటి ముగింపు కంటే 6 పైసలు తగ్గింది. బ్యాంకులు అధిక స్థాయిలో యుఎస్‌ డాలర్లను నిరంతరం కొనుగోలు చేయడం, ఎఫ్‌ఐఐ ఇన్‌ప్లోలు కొనసాగడం దీనికి కారణమని చెబుతున్నారు. దేశీయ స్టాక్‌ మార్కెట్లలో, సెన్సెక్స్‌ 165.35 పాయింట్లు తగ్గి 84,972.92కు, నిప్టీ 77.85 పాయింట్లు తగ్గి 25,954.35కు చేరుకుంది. రూపాయి క్షీణత 2025 అంతటా ఉంది. అప్పుడప్పుడు తిరిగి పుంజుకునే సంకేతాలు వచ్చినప్పటికీ కొనసాగలేకపోయింది. 2025 ప్రారంభంలో రూపాయి బలహీనపడటం ప్రారంభమైంది. 2025 జనవరి మధ్య నాటికి, రూ.86.70కి పడిపోయింది. మార్చి 10న 30 పైసలు తగ్గి సుమారు రూ.87.25కి చేరుకుంది. సెప్టెంబర్‌లో ఇది ఆల్‌టైమ్‌ కనిష్ఠ స్థాయికి చేరుకుంది. దాదాపు రూ.88.79కి చేరుకుంది. నవంబర్‌ 21న రూ.89.49కి పడిపోయింది. నవంబర్‌ చివరిలో ఇది కోలుకునే సంకేతాలను చూపించింది. కొన్ని రోజుల్లో రూ.89.26` రూ.89.28 మధ్య ట్రేడవుతూ నిలిచింది. కానీ దీనిని నిలబెట్టుకోలేకపోయింది. డిసెంబర్‌ నాటికి ఇది 90 దాటి దిగువకు పడిపోయింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *