స్వామివారిని దర్శించుకున్న స.హ చట్టం కమిషనర్ 

యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, జులై 12:  ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని శనివారం సమాచార హక్కు చట్టం కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ముందుగా కొండపైకి చేరుకున్న కమిషనర్ కు ఆలయ సాంప్రదాయ ప్రకారం స్వాగతం పలికిన ఆలయ అర్చకులు అనంతరం స్వయంభు లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం చేశారు ఆలయ అధికారులు స్వామివారి చిత్రపటాన్ని లడ్డు ప్రసాదం అందజేశారు.

యాదాద్రి  ఆలయంలో భక్తుల రద్దీ

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి పోటెత్తిన భక్తులు శనివారం సెలవు దినం కావడంతో రాష్ట్ర నలుమూలల నుంచి స్వామివారి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు కొండపైన నిత్య కళ్యాణం మరియు కొండ కింద సత్యనారాయణ వ్రత మండపము పుష్కరిణి కళ్యాణకట్ట ప్రాంతాలలో భక్తులతో నిండిపోయాయి స్వామివారి సర్వదర్శనానికి సుమారు రెండు నుంచి మూడు గంటల సమయం పట్టగా ప్రత్యేక దర్శనానికి ఒక గంట సమయం పట్టింది కొండపైన ఆలయ పురవీధులు భక్తులతో కిటకిటలాడాయి ఈ సందర్భంగా యాదాద్రి దేవస్థాన అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా స్వామివారిని త్వరగా దర్శించుకునే విధంగా ఏర్పాట్లు చేశారు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *