– ప్రత్యేక బస్సులు నడుపుతున్న ఆర్టీసీ
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 1: దసరా పండుగ సందర్భంగా హైదరాబాద్ నగర వాసులు సొంతూళ్లకు బయలుదేరారు. ప్రస్తుతం బస్‌స్టాండ్‌లు అన్ని జనాలతో కిక్కిరిసిపోయాయి. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. దసరాకి ప్రత్యేకంగా 7754 బస్సులను ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసింది. జేబీఎస్, ఎంజీబీఎస్‌తో పాటు ఆరంఘర్, ఎల్బీ నగర్, ఉప్పల్ వంటి రద్దీ ప్రాంతాల్లో తాత్కాలిక బస్ స్టాండ్‌లను ఆర్టీసీ అధికారులు ఏర్పాటు చేశారు. గతంలో పండగలకు జనాలు ఆర్టీసీ బస్సులలో కిక్కిరిసిన రద్దీతో వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు పండగలకు అధిక సంఖ్యలో బస్సులను ఏర్పాటు చేయడంతో.. ప్రయాణికులు ప్రశాంతంగా జర్నీ చేస్తున్నారు. బస్సులు చాలా ఉండడంతో చాల మంది ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక 2013 జీవో ప్రకారమే పండగలకు అదనపు చార్జీలు వసూలు చేస్తున్నామని ఆర్టీసీ అధికారులు చెప్పారు. రిటర్న్ జర్నీ ఖాలీగా రావాల్సి వస్తుండటంతో.. చాలా మినిమం చార్జీలు వొసూలు చేస్తున్నామని తెలిపారు. రేపే దసరా కాబట్టి ఇప్పటికే సగానికి పైగా సిటీ ఖాలీ అవ్వగా.. రాత్రికి మొత్తం ఖాలీ అయ్యే అవకాశం ఉంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



