ఆర్టీసీ ఉద్యోగులకు సంస్థ షాక్‌

-‌ ఫ్యామిలీ ప్లానింగ్‌ ఇం‌క్రిమెంట్‌ ‌రద్దు

హైదరాబాద్‌ ,‌ప్రజాతంత్ర, మార్చి 18: ఆర్టీసీ ఉద్యోగులు, అధికారులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బిగ్‌ ‌షాక్‌ ఇచ్చింది. ఫ్యామిలీ ప్లానింగ్‌ ‌స్కీం కింద ఇచ్చే స్పెషల్‌ ఇం‌క్రిమెంట్‌ను రద్దు చేస్తూ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ బోర్డు తీర్మానం ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ వెల్లడించింది. ఇకపై ఉద్యోగులు, వారి జీవిత భాగస్వామి.. ఫ్యామిలీ ప్లానింగ్‌ ఆపరేషన్‌ ‌చేయించుకున్నా ఈ ప్రత్యేక ఇంక్రిమెంట్‌ ఇవ్వబోమని యాజమాన్యం స్పష్టం చేసింది. ఈ మేరకు టీజీఎస్‌ఆర్టీసీ సర్క్యులర్‌ ‌జారీ చేసింది. ఫ్యామిలీ ప్లానింగ్‌ ‌స్కీం కింద స్పెషల్‌ ‌క్యాజువల్‌ ‌లీవ్‌ ‌మాత్రమే కొనసాగుతుందని తెలిపింది. ఆర్టీసీ యాజమాన్యం తీసుకున్న ఈ నిర్ణయాన్ని కార్మిక సంఘాలు తీవ్రంగా ఖండించాయి. గతంలో ఈ స్కీమ్‌ ‌ద్వారా కుటుంబ నియంత్రణనును ప్రోత్సహించేవారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *