ఏడడుగుల కండక్టర్ కు సీఎం బాసట

మరో ఉద్యోగం ఇప్పించాలని అధికారులకు ఆదేశాలు

ఆరు అడుగుల బస్సులో ఏడు అడుగుల పొడవుతో కండక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ఆర్టీసీ ఉద్యోగి అమీన్‌ అహ్మద్‌ అన్సారీ గత వారం రోజులుగా సోషల్ మీడియాలో హల్‌చల్‌ ‌చేస్తున్నాడు. బస్సు ఎత్తుకు మించి పొడవు ఉండటంతో విధులు నిర్వహించడం సవాల్‌గా మారిందనితరచూ బస్సుల్లో రోజూ సగటున 5 ట్రిప్పుల్లో 10 గంటల వరకు ప్రయాణించాల్సి వొస్తోందని వాపోయాడు. 195 సెం.మీ. ఎత్తుండే బస్సు లోపల 214 సెం.మీ. పొడవున్న తాను గంటల తరబడి తల వంచి ప్రయాణిస్తుండటం వల్ల మెడవెన్నునొప్పినిద్ర లేమితో హాస్పిటల్స్ ‌చుట్టూ తిరగాల్సి వొస్తోందని తన గోడు విన్నవించుకున్నాడు.

ఇందుకు సంబంధించిన వార్తలువీడియోలు సోషల్‌ ‌మీడియాలో వైరల్‌ ‌కావడంతో అతడికి ఆర్టీసీలోనే మరేదైనా ఉద్యోగం ఇచ్చేలా చూడాలని ప్రయాణికులు సైతం విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ క్రమంలో ఏడడుగుల కండక్టర్‌ ‌సమస్యపై సీఎం రేవంత్‌ ‌రెడ్డి స్పందించారు. అతడికి ఆర్టీసీలోనే వేరే ఉద్యోగం ఇవ్వాలని అధికారులకు సూచించారు. ఈ విషయాన్ని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌స్వయంగా తన ఎక్స్ ‌ఖాతాలో వెల్లడించారు. సీఎం రేవంత్‌ ‌రెడ్డి ఆదేశాల మేరకు కండక్టర్‌కు వేరే ఉద్యోగం ఇవ్వాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ను మంత్రి పొన్నం ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *