దసరా ప్రయాణికులకు శుభవార్త

– 7,754 స్పెషల్‌ ‌బస్సులను నడపనున్న ఆర్టీసి

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌18: ‌దసరా, బతుకమ్మ పండుగల సీజన్‌ ‌సమీపిస్తుండటంతో, సొంత గ్రామాలకు వెళ్లే ప్రయాణికుల కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని అదనపు సర్వీసులను నడపాలని నిర్ణయించింది. ప్రజల ప్రయాణాన్ని సురక్షితంగా, సౌకర్యవంతంగా మార్చడమే లక్ష్యంగా ఆర్టీసీ ఈ చర్యలు చేపట్టింది. ఈ పండుగ సీజన్‌లో ప్రయాణికుల రద్దీని సులభతరం చేయడానికి, టీజీఎస్‌ఆర్టీసీ సెప్టెంబర్‌ 20 ‌నుంచి అక్టోబర్‌ 2 ‌వరకు ఏకంగా 7,754 స్పెషల్‌ ‌బస్సులను నడపనుంది. ఈ బస్సులలో, 377 సర్వీసులకు ఆన్‌లైన్‌ ‌రిజర్వేషన్‌ ‌సౌకర్యం కల్పించబడింది. దీంతో ప్రయాణికులు ఇంటి నుంచే తమ టిక్కెట్లను బుక్‌ ‌చేసుకోవచ్చు, తద్వారా కౌంటర్ల వద్ద నిరీక్షణ తప్పించుకోవచ్చు. సెప్టెంబర్‌ 30 ‌న సద్దుల బతుకమ్మ, దసరా రోజు రోజుల్లో సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికుల సంఖ్య భారీగా ఉండే అవకాశం ఉంది. ఈ రద్దీని తట్టుకోవడానికి ప్రధాన బస్టాండ్ల నుంచి ప్రత్యేక బస్సులు అందుబాటులోకి వస్తాయి. అలాగే, పండుగలు ముగిసిన తర్వాత తిరిగి నగరానికి వొచ్చేవారి సౌకర్యార్థం అక్టోబర్‌ 5, 6 ‌తేదీల్లో కూడా ప్రత్యేక బస్సులు నడపనున్నారు. ఈ ప్రత్యేక బస్సుల ద్వారా, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సులభంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవచ్చు. అదనపు ఛార్జీలు లేకుండానే సాధారణ బస్సుల టికెట్‌ ‌ధరలకే ఈ సేవలు లభ్యం అవుతాయి. దసరా పండుగను ఆనందంగా జరుపుకోవడానికి ఊరెళ్లే ప్రయాణికులు ఈ సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ అధికారులు కోరారు. మరిన్ని వివరాల కోసం టీజీఎస్‌ఆర్టీసీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు లేదా సమీపంలోని బస్టాండ్‌లో విచారించవచ్చు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *