ఆర్‌ఎస్‌ ‌ప్రవీణ్‌ ‌కుమార్‌కు సిట్‌ ‌నోటీసులు

– ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌కేసు

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూలై19: ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో విచారణలో భాగంగా మాజీ ఐపీఎస్‌ అధికారి, బీఆర్‌ఎస్‌ ‌నేత ఆర్‌ఎస్‌ ‌ప్రవీణ్‌ ‌కుమార్‌కు సిట్‌ అధికారులు నోటీసులు అందించారు. నోటీసు అందుకున్న రెండు రోజుల్లో ఉదయం 11 నుండి సాయంత్రం 6 గంటల్లోపు వాగ్మూలం ఇచ్చేందుకు తమ కార్యాలయానికి రావాలని పేర్కొన్నారు. కాగా సిట్‌  ‌నోటీసులపై ప్రవీణ్‌ ‌కుమార్‌ ‌స్పందించలేదు. వాగ్మూలం ఇచ్చేందుకు ఆయన నిరాకరించినట్లు తెలుస్తోంది. బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇవ్వాల్సి వస్తుందనే నిరాకరిస్తున్నట్లు సమాచారం. అయితే ఈనెల 14 న ప్రవీణ్‌ ‌కుమార్‌కు సిట్‌ ‌నోటీసులు ఇవ్వగా ఆయన ఇంకా స్పందించలేదు. గతంలో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు హోదాలో.. బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం తన ఫోన్‌ ‌ను హ్యాక్‌ ‌చేస్తుందని, ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌కి పాల్పడుతుందని కేంద్ర ఎన్నికల సంఘంతో డీజీపీకి ఆయన ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. వాటి ఆధారంగానే ప్రవీణ్‌ ‌కుమార్‌కు నోటీసులు ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *