– పలు అభివృద్ధి పనులకు మంత్రి పొంగులేటి శంకుస్థాపన
మహబూబాబాద్, ప్రజాతంత్ర, జనవరి 13: ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే లక్ష్యంగా అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రభుత్వం సమన్వయంతో అమలు చేస్తోందని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. మహబూబాబాద్ పట్టణ పరిధిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, శిలాఫలకాల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని మంగళవారం ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్, ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళీ నాయక్, ఇన్‌చార్జి కలెక్టర్ లెనిన్ వత్సల్ టోప్పో లతో కలిసి మంత్రి పొంగులేటి వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.ఇల్లందు రోడ్డులోని 17వ వార్డులో రూ.55 లక్షల విలువ కలిగిన సీసీ రోడ్లు, మురుగు కాల్వల, పైపు లైన్ నిర్మాణం, బేతోలు పరిధిలోని 6వ వార్డులో రూ.50 లక్షలతో అంతర్గత సీసీ రోడ్లు, మురుగు కాల్వల నిర్మాణం, రూ.7 కోట్లతో బంధం చెరువు సుందరీకరణ పనులు, రూ.64 లక్షలతో 19వ వార్డులోని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే రూ.40 లక్షలతో 33వ వార్డు, తహసీల్దార్ కార్యాలయం వద్ద అంతర్గత సీసీ రోడ్లు, మురుగు కాల్వల నిర్మాణం, రూ.3కోట్లతో 23వ వార్డులో అంతర్గత రోడ్లు, రూ.59 లక్షలతో జంక్షన్ పరిధిలో సీసీ రోడ్లు, మురుగు కాలువల నిర్మాణం, రూ. 12 కోట్లతో 11వ వార్డులోని నందన గార్డెన్ రోడ్డు నందు హస్తినాపురం కాలనీ అభివృద్ధి, వరద ముంపు నివారణకు మురుగు కాల్వల పనులు, రూ.50 లక్షలతో ఇల్లందు రోడ్డులో గల 6, 17వ వార్డు జ్యోతిరావు ఫూలే జంక్షన్ ప్రాంతం అభివృద్ధి పనులు, సీసీ రోడ్లు, మురుగు కాల్వల నిర్మాణం, రూ.కోటి వ్యయంతో 32, 18వ వార్డులలో బొడ్రాయి సెంటర్ ప్రాంతం అభివృద్ధి పనులకు, రూ. కోటి వ్యయంతో 13, 14వ వార్డుల్లో మోర్ సూపర్ మార్కెట్ వద్ద బస్టాండ్ రోడ్డు అభివృద్ధి పనులకు కూడా శంకుస్థాపనలు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం ప్రతి పేదవాడికీ అండగా నిలుస్తూ ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నిబద్ధతతో అమలు చేస్తోందన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ అని అన్నారు, కార్యక్రమంలో ఆర్డీవో కృష్ణవేణి, మున్సిపల్ కమిషనర్ రాజేశ్వర్, స్థానిక ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





