-కొత్త డిస్కమ్, థర్మల్ ప్లాంట్‌ల నిర్మాణంలో కమీషన్లు
– విద్యుత్ శాఖను ఎపి ప్రభుత్వం నడుపుతోందా?
– ఎన్టీపీసీ తక్కువ రేట్లకే విద్యుత్ ఇస్తామంటే తీసుకోరా?
– మీడియా సమావేశంలో బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు
హైదరాబాద్,ప్రజాతంత్ర,డిసెంబర్1: విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. ఇప్పటికే ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ ఉండగా కొత్త డిస్కమ్ ఎందుకని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ డైరెక్షన్‌లోనే రేవంత్ యాక్షన్ చేస్తున్నారని ఆరోపించారు. ఇలా ధర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సర్కార్ రూ.50వేల కోట్ల స్కాంకు తెరలేపిందని హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ధర్మల్ విద్యుత్‌ను తగ్గిస్తామన్న ప్రభుత్వం కొత్త ప్లాంట్లు ఎందుకు నిర్మిస్తోందని ప్రశ్నించారు. తెలంగాణ భవన్‌లో హరీష్ రావు సోమవారం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ అధికారులను అవమానించిన కుమార్ రాజాను వెంటనే తరిమికొట్టాలని హెచ్చరించారు. అండర్ గ్రౌండ్ కేబుల్స్, పంప్డ్ స్టోరేజీ, బ్యాటరీ స్టోరేజీ కరెంట్ సహా ఇంటర్‌స్టేట్ స్కామ్‌నూ త్వరలోనే ఆధారాలతో సహా బయటపెడతాం అని తెలిపారు. రామగుండం థర్మల్ విద్యుత్ కేంద్రంలో రూ.50 వేల కోట్ల స్కాంను బయటపెట్టినందుకే తనను టార్గెట్ చేస్తున్నారని హరీష్ రావు అన్నారు. కమీషన్ల కోసమే కొత్త థర్మల్ ప్లాంట్ నిర్మిస్తున్నారని ఆరోపించారు. రూ.10,800 కోట్లతో జెన్కో డీపీఆర్ ఇచ్చింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఎన్టీపీసీ వాళ్లు రూ.4.12లకు యూనిట్ ఇస్తామంటే ప్రభుత్వం ముందుకు రాలేదన్నారు .ఎన్టీపీసీ 2400 మెగావాట్ల విద్యుత్ ఇస్తామంటే ఎందుకు ముందుకు రావట్లేదని ప్రశ్నించారు. రామగుండం కొత్త ధర్మల్ ప్రాంట్ తో రోజూ ప్రజలపై రూ. 9 కోట్ల భారం పడుతుందని చెప్పారు. 25 ఏండ్లకు కొత్త ప్లాంట్ తో ప్రజలపై రూ. 82 వేల కోట్ల భారం పడుతుందన్నారు. తక్కువ ధరకు వొచ్చే విద్యుత్ ను ఎందుకు వొద్దంటున్నారని ప్రశ్నించారు. రూ.82 వేల కోట్ల భారం ప్రజలెందుకు భరించాలన్నారు హరీష్. కాంగ్రెస్ వొచ్చిన తర్వాతే కరెంట్ లో ఈ దుస్థితి వొచ్చిందన్నారు. విద్యుత్ శాఖలో తెలంగాణ ప్రాంత అధికారులను నియమించాలని డిమాండ్ చేశారు. ధర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణంపై అఖిలపక్షం సమావేశం ఏర్పాటు చేయాలని సూచించారు. కషన్ల కోసమే కొత్త విద్యుత్ ప్లాంట్లు నిర్మిస్తున్నారని ఆరోపణలు చేశారు. ఎన్టీపీసీ.. రూ.4.12పైసళ్లకు యూనిట్ విద్యుత్ ఇస్తామంటే తీసుకోవడానికి కాంగ్రెస్ సర్కార్ ఎందుకు ముందుకు రావట్లేదని ప్రశ్నల వర్షం కురిపించారు. ఎన్టీపీసీ 2,400 మెగావాట్ల విద్యుత్ ఇస్తామంటే ఎందుకు ముందుకు రాలేదు? అని నిలదీశారు హరీష్ రావు. ఎన్టీపీసీ ఇచ్చే తక్కువ ధర కరెంటును కాదని.. సొంతంగా విద్యుత్ ప్లాంట్లు ఎందుకు ఏర్పాటు చేస్తామని అంటున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వొచ్చిన తర్వాతే విద్యుత్ రంగంలో ఈ దుస్థితి నెలకొందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ శాఖను తెలంగాణ ప్రభుత్వం నడుపుతుందా..? లేదా ఏపీ ప్రభుత్వం నడుపుతుందా? అని ఎద్దేవా చేశారు. విద్యుత్ శాఖలో తిష్టవేసుకుని కూర్చున్న ఆంధ్ర ప్రాంత అధికారులను వెంటనే సాగనంపాలని సూచించారు. సీఎం రేవంత్‌రెడ్డి సర్పంచ్ ఎన్నికలను ప్రభావితం చేస్తున్నారని ఆరోపించారు. వోటర్లను సీఎం పరోక్షంగా ప్రభావితం చేస్తుంటే ఎన్నికల సంఘం ఏం చేస్తోందని ప్రశ్నించారు. గ్రామాల్లో ఎన్నికలు జరుగుతుంటే పట్టణాల్లో సీఎం తిరుగుతానంటే ఎలా అని నిలదీశారు హరీశ్‌రావు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




