ఎస్సీ విద్యార్థుల ఖాతాల్లోకి రూ.374 కోట్లు

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 11: పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్‌ల కింద ఎస్సీ విద్యార్థులకు బోధనా రుసుములు (ట్యూషన్ ఫీజు), నిర్వహణ చార్జీలను ఈ సంవత్సరంలో ఇప్పటికి రూ.374.00 కోట్లు, రాష్ట్రంలోని వివిధ కళాశాలలకు చెందిన 83,239 మంది ఎస్సీ విద్యార్థుల ఖాతాల్లోకి జమ చేశారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద రూ.173.00 కోట్లు విడుదల చేయగా కేంద్ర ప్రభుత్వం రూ.201.00 కోట్లు విడుదల చేసింది. విద్యార్థులు తమకు చెందిన నిర్వహణ సొమ్మును మినహాయించుకుని బోధానా రుసుమును (ట్యూషన్ ఫీజు), ఇతరేతర రుసుములను కళాశాలలకు చెల్లించాల్సి ఉంటుంది. ఉపకాs Áవేతన నిధులు జమ అయిన విద్యార్థుల వివరాలు సంబంధిత కళాశాల ప్రిన్సిపాల్స్ ఈ-పాస్ లాగిన్‌లలో పొందుపరిచినట్లు ఎస్సీ అభివద్ధి శాఖ కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నిధులను విడుదల చేసిన ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డికి, ఉప Ÿముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కకు, నిధుల విడుదల కోసం విశేషమైన కృషి చేసిన ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌కి ఉపకార వేతనాలు పొందిన విద్యార్థులు ధన్యవాదాలు తెలియజేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *