అసోంలో మహిళలకు రూ.3 వేల తాయిలం

– 31 హామీలతో బిజెపి మేనిఫెస్టో విడుదల

గౌహతి,మార్చి31: త్వరలో ఎన్నికలు జరగనున్న అస్సాంలో మంగళవారం బిజెపి సంకల్ప పాత్ర పేరుతో 31 హాలతో మేనిఫెస్టోను విడుదల చేసింది. ఈ హాల్లో కీలకంగా ఉమ్మడి పౌరస్మ•తి (యుసిసి), మహిళలకు అరుణోదరు పథకం కింద నెలకు మూడువేల రూపాయల్ని నేరుగా తమ బ్యాంకు అకౌంట్లలో జమ చేయడం వంటివి ఉన్నాయి. మేనిఫెస్టో విడుదల సందర్బంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మాట్లాడుతూ.. ’అస్సాంని ప్రకాశవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దడమే బిజెపి లక్ష్యంగా పెట్టుకుంది’ అని ఆయన అన్నారు. ఉత్తరాఖండ్‌, ‌గుజరాత్‌ ‌రాష్టాల్ర మాదిరిగానే అస్సాంలో కూడా యుసిసిని అమలు చేయడమే బిజెపి అజెండా అన్నారు. అలాగే లవ్‌ ‌జీహాద్‌కు వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటాం అని ఆయన అన్నారు. యుసిసిని రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల పరిధిలోకి వచ్చే ప్రాంతాల నుంచి మినహాయిస్తామని, గిరిజన వర్గాల్లో దీని అమలు చేయమని ఆయన అన్నారు. రద రహిత అస్సాంను మార్చేందుకు రాబోయే రెండేళ్లలో 18 వేల కోట్లను ఖర్చు చేస్తాం. లక్షపతి దీదీ పథకం కింద 40 లక్షల మంది మహిళలకు 25 వేల రూపాయలు అందిస్తాం. వచ్చే ఐదేళ్లలో రెండు లక్షల జాబ్‌లు ఇస్తాం. ఒక జిల్లా, ఒక కళాశాల, ఒక విశ్వవిద్యాలయం, ఒక ఇంజనీరింగ్‌ ‌కళాశాలను ఏర్పాటు చేస్తాం. అరుణోదరు పథకం కింద ఇస్తున్న రూ. 1250లను పెంచి మహిళలకు 3,000లు అందించడానికి ప్రయత్నిస్తాం అని హిమంతబిశ్వ శర్మ అన్నారు. మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో సిఎం హిమంత బిశ్వ శర్మ, కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్‌, ‌సర్బానంద సోనోవాల్‌, ఆ ‌రాష్ట్ర బిజెపి అధ్యక్షడు దిలీప్‌ ‌సైకియా హాజరయ్యారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *