మం్రతి కొండా సురేఖ
హైదరాబాద్ః త్వరలో ప్రారంభం కానున్న బోనాల ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వాన్ని రూ. 30 కోట్లు అడిగామని, అయితే రూ. 20 కోట్లు కేటాయించిందని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. ఈ ఉత్సవాలకు సంబంధించి అన్ని విభాగాల అధికారులతో మంగళవారం సమావేశం ఏర్పాటు చేశామని చెప్పారు. గత ఏడాది బోనాల పండుగ ఎలాంటి ఇబ్బంది లేకుండా జరుపుకున్నామని, ఒకటి రెండుచోట్ల ఇబ్బందులు తలెత్తాయని, ఈ సారి ఎలాంటి సమస్యలు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని పేరొ్్కనా ్నరు. వీఐపీ ల రాకపోకల సమమాలలో తొక్కిసలాటలు జరుగుతున్నాయని, అవి జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. జోగినీలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని, గతంలో జరిగిన దానికంటే ఇంకా బాగా ఉత్సవాలు జరపాలనుకుంటున్నామని సురేఖ వివరించారు. సరస్వతి పుష్కరాలు కూడా అద్భుతంగా నిర్వహించామని, పక్క రాష్ట్రాల భక్తులు కూడా ఎంతో అభినందించారని అన్నారు. అధికారులు సమన్వయంతో విధులు నిర్వరి్తంచాలని, సంయమనం పాటించాలని కోరుతున్నామన్నారు. భక్తులతో దురుసుగా ప్రవర్తించకుండా మర్యాద పూర్వకంగా వ్యవహరిస్తూ దర్శనం చేయించాలన్నారు. గత ఏడాది బోనాల సమయంలో పొన్నం ప్రభాకర్ వీడియో వైరల్ అయిందని., ఈసారి ఎలాంటి తప్పిదాలు జరగకుండా విధినిర్వహణ సక్రమంగా చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.





