అభివృద్ధిలో డీఎంఎఫ్‌ల పాత్ర కీలకం

– కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

న్యూదిల్లీ, ప్రజాతంత్ర, మార్చి 24: నీతి ఆయోగ్, భాస్కరాచార్య ఇన్‌స్టిట్యూట్ ఫర్ స్పేస్ అప్లికేషన్స్ అండ్ జియో ఇన్ఫర్మాటిక్స్, రాష్ట్రాలు కలిసి డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ (డీఎంఎఫ్)లను మరింత బలోపేతం చేసేందుకు సహకార సమాఖ్య స్ఫూర్తిగా కలిసికట్టుగా పనిచేస్తున్నాయని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. రెండు రోజులుగా జరుగుతున్న డీఎంఎఫ్ వర్క్‌షాప్ విజయవంతం అయినందుకు సంతోషంగా ఉందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజన్‌కు అనుగుణంగా మన దేశ ఖనిజ సంపద ప్రజల సమగ్ర, దీర్ఘకాల అభివృద్ధికి ఉపయోగపడేలా కృషి చేయాల్సి ఉందన్నారు. రీఫామ్, పర్ఫామ్, ట్రాన్స్‌ఫాం మంత్రాన్ని ప్రతి స్థాయిలో ఆచరించాలి. ఇక మైనింగ్ ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి చేసేందుకు డీఎంఎఫ్ కీలక పాత్ర పోషిస్తాయన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 650కు పైగా జిల్లాల్లో మినరల్ ఫౌండేషన్లు ఉన్నాయి. ణవీఖీలను యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ కార్యక్రమంతో అనుసంధానం చేసి మరింత సమన్వయంతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ఆయా ప్రాంతాల్లో ఆరోగ్యం, విద్య, తాగునీరు, ఉపాధి కల్పించేందుకు ఈ నిధులను వినియోగించుకోవాలని కిషన్‌రెడ్డి ప్రభుత్వాలకు సూచించారు. రెండు రోజులపాటు జరిగిన ఈ కార్యక్రమంలో మైనింగ్ రంగంలో అనేక అంశాలపై విస్తృత చర్చ జరిగిందని, మైనింగ్ రంగంలో ఉత్తమ విధానాల గురించి ఆలోచనలను పంచుకున్నారని తెలిపారు. వాటిని జిల్లా స్థాయిలో సమన్వయాన్ని బలోపేతం చేయాలి. నిధులు సమయానికి విడుదల కావాలి, అనుమతులు వేగంగా ఇవ్వాలి, పర్యవేక్షణ నిరంతరం సమర్థవంతంగా ఉండాలి అన్నారు. డిజిటల్ రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పులను డీఎంఎఫ్‌లో భాగస్వామ్యం చేసి సాంకేతికను సమర్థవంతంగా వినియోగించాలి. డీఎంఎఫ్ పోర్టల్ 2.0 వంటి వేదికలను సమర్థవంతంగా ఉపయోగించాలి. ఫలితాలపై దృష్టి పెట్టాలి. క్షేత్రస్థాయిలో మార్పులు వచ్చేలా ప్రతి ఒక్కరూ సమన్వయంతో ముందుకు సాగాలి అని మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *