– పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క
ములుగు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 9: గ్రామీణ ప్రాంతాలతోపాటు మండల,జిల్లా కేంద్రాలలో రోడ్డు నిర్మాణ పనులు చేపట్టడానికి ప్రభుత్వం ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకున్నదని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. జిల్లా కేంద్రంలోని జాతీయ రహదారి 163 నుండి మదనపల్లి క్రాస్ రోడ్డు వరకు రూ.4 కోట్లతో చేపట్టనున్న రోడ్డు వెడల్పు, డివైడర్, సెంట్రల్ లైటింగ్ పనులను జిల్లా కలెక్టర్ దివాకర్ టి.ఎస్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవి చందర్‌లతో కలిసి మంత్రి సీతక్క మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేయడమేకాక ఇప్పటికీ రోడ్డు సౌకర్యం లేని గ్రామాలకు పూర్తిస్థాయిలో రోడ్డు నిర్మాణాలు చేపట్టడానికి ప్రభుత్వం ప్రత్యేక నిధులను కేటాయించిందని వివరించారు. ఇప్పటికే జిల్లా కేంద్రం నుండి పలు గ్రామాలకు వెళ్లే రహదారులను విస్తరించి పనులను పూర్తి చేయనున్నట్లు తెలిపారు. బతుకమ్మ పండుగ నాటికి రోడ్డు పనులను నాణ్యతతో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సంపత్, పంచాయతీరాజ్ ఈ.ఈ అజయ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



