– ఇందుకు అధికార్లు తగిన చర్యలు తీసుకోవాలి
– మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 24: జనవరి 1- 30 వరకు జరిగే జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల కార్యక్రమంలో మంత్రులు , ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలు , ఐఏఎస్,ఐపీఎస్ లు కొత్తగా ఎన్నికైన సర్పంచ్ లు ప్రతి ఒక్కరు పాల్గొనేలా రవాణా శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికార్లకు సూచించారు. బుధవారం సాయంత్రం రవాణా శాఖ అధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ జూమ్ సమావేశం నిర్వహించారు. ప్రతి గ్రామం నుండి స్కూల్ లు ,కాలేజీలు ప్రతి విద్యార్థి రోడ్డు భద్రత పై ప్రతిజ్ఞ చేయాలి. రోడ్డు భద్రత మాసోత్సవంలో దేశంలోనే తెలంగాణ నెంబర్ 1 గా ఉండాలి. విద్యార్థులకు ,డ్రైవర్లకు ప్రతి పౌరునికి రోడ్డు భద్రత పై అవగాహన కల్పించాలన్నారు. ఎన్ ఎస్ ఎస్, లయన్స్ క్లబ్,రోటరీ క్లబ్ లు పాల్గొనేలా చర్యలు తీసుకోవాలి వారికి జనవరి 26 న ప్రశంస పత్రాలతో సత్కరించాల న్నారు. రోడ్డు భద్రత మాసోత్సవం కార్యక్రమంలో భాగంగా రంగోలి కార్యక్రమాలు ,క్విజ్ పోటీలు, వ్యాసరచన పోటీలు చేయించాలి. బైక్ ర్యాలీలు , బ్లడ్ డొనేషన్ క్యాంపులు ,వాక్ థన్ ర్యాలీలు నిర్వహిం చాలన్నారు. జిల్లా రోడ్డు సేఫ్టీ కమిటీ లు సమావేశాలు నిర్వహించాలి. ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్ లను గుర్తించి వాటిని తొలగించాలని ఆదేశించారు. ఆర్టీఏ సభ్యులు రోడ్డు భద్రత కార్యక్రమాలకు జిల్లాల్లో విసృత ప్రచారం కల్పించాలన్నారు. ఈ సమీక్షా సమావేశంలో రవాణా శాఖ కమిషనర్ ఇలాంబర్తి, జెటిసి లు రమేష్ , చంద్రశేఖర్ , శివ లింగయ్య, డిటిసి లు ,ఎంవీఐ లు , ఏఎంవీఐ, ఆర్టీఏ సభ్యులు ఇతర అధికారులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




