– ఖమ్మం జిల్లాలో ముగ్గురు, మహబూబాబాద్‌లో ఒకరు
ఖమ్మం, ప్రజాతంత్ర, డిసెంబర్ 3 : రెండు వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం చెందారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి వద్ద బుధవారం జరిగిన ప్రమాదంలో ముగ్గురు, మహబూబాబాద్ జిల్లాలో జరిగిన మరో ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టాపురం వద్ద అదుపుతప్పిన కారు డివైడర్‌ను ఢీకొని ఎగిరి అవతల వైపునకు పడిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులను సిద్దేశీజాయ్ (18), సాదిక్ (16), శశి (12)లుగా గుర్తించారు. చంద్రుగొండ నుంచి సత్తుపల్లికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఇక మహబూబాబాద్ జిల్లాలో లారీని ద్విచక్ర వాహనం ఢీ కొట్టడంతో ఒకరు మృతిచెందారు. ఈ విషాదకర సంఘటన మహబూబాబాద్ మండలం జమాండ్లపల్లి గ్రామ శివారులో చోటుచేసుకుంది. రైల్వేలో జేఈఈగా పనిచేస్తున్న భగవత్ అనే వ్యక్తి లారీని వెనుక నుంచి ఢీకొట్టి అక్కడికక్కడే మృతిచెందాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





