వరంగల్‌ ‌నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం

– ద్విచ‌క్ర వాహ‌నాన్ని ఢీకొన్న‌ టిప్పర్‌
– నిండు గర్భిణి అయిన‌ వైద్యురాలి మృతి

వరంగల్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 27: వరంగల్‌ ‌నగరంలో విషాద ఘటన చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణిగా ఉన్న వైద్యురాలు మృతిచెందారు. \మ‌ట్టెవాడ‌ ఎస్సై శివకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం కర్ణాటకలోని గుల్బర్గా జిల్లా చించోలి మండలం బత్తంపల్లికి చెందిన ఎస్‌.‌మమతారాణి వైద్యురాలిగా పనిచేస్తున్నారు. నగరంలోని హంటర్‌ రోడ్డులోని ఫాదర్‌ ‌కొలంబో ఆస్పత్రిలో జనరల్‌ ‌మెడిసిన్‌ ‌విభాగంలో విధులు నిర్వర్తిస్తున్నారు. గతేడాది నారాయణపేట జిల్లాకు చెందిన డాక్టర్‌ ‌రాఘవేంద్రతో ఆమెకు వివాహం జరిగింది. సోమవారం రాత్రి విధులు ముగించుకొని భర్తతో కలిసి హంటర్‌ ‌రోడ్డు మీదుగా బైక్‌పై ఇంటికి బయల్దేరారు. మార్గంమధ్యలో ఏడు మోరీల కూడలి వద్దకు రాగానే వెనక నుంచి వచ్చిన టిప్పర్‌ ‌వారి బైక్‌ను ఢీకొట్టింది. దీంతో భార్యాభర్తలు కింద పడిపోయారు. తొమ్మిది నెలల గర్భిణిగా ఉన్న మమతారాణి తీవ్రంగా గాయపడటంతో ఆమె భర్త స్థానికుల సహాయంతో నగరంలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌కి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందారు. టిప్పర్‌ ‌డ్రైవర్‌ అన్సారీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని ఝార్ఖండ్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *