– లక్సెట్టిపేటకు చెందిన దంపతుల దుర్మరణం
మంచిర్యాల, జనవరి 16: తమిళనాడులోని కన్యాకుమారి సవిూపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన దంపతులు మరణించారు. అయ్యప్ప మాల ధరించిన వారు శబరిమలకు వెళ్లొస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటకు చెందిన పాలకుర్తి సత్యనారాయణ (63), రమాదేవి (59) జనరల్ స్టోర్ నిర్వహిస్తున్నారు. ఇటీవల అయ్యప్ప మాల ధరించిన ఈ దంపతులు 8వ తేదీన ఓ ప్రైవేటు సర్వీస్‌లో శబరిమల దర్శనానికి వెళ్లారు. 15న మకర సంక్రాంతి రోజున అయ్యప్ప స్వామి దర్శనం చేసుకుని తిరిగి బయల్దేరారు. ఈ క్రమంలో కన్యాకుమారి సవిూపంలో బైపాస్ రోడ్డులో బస్సును ఆపారు. అక్కడ సముద్ర స్నానం చేసుకుని దేవాలయాలు సందర్శించుకుని బస్సు దగ్గరకు వస్తుండగా వారిని ఓ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దంపతులిద్దరూ దుర్మరణం చెందారు. మృతదేహాలను కన్యాకుమారి ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. కన్యాకుమారి పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





