రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, జనవరి 6 : గచ్చిబౌలి ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందిన సంఘటన కలకలం రేపింది. గచ్చిబౌలి గౌలిదొడ్డిలోని స్టే హోటల్లో రిసెప్షనిస్టుగా పనిచేస్తున్న ఉత్తరప్రదేశ్ కు చెందిన సూరజ్ సింగ్ (23) ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. సోమవారం తెల్లవారుజామున సూరజ్ సింగ్ గౌలిదొడ్డి నుంచి విప్రో సర్కిల్ వైపు తన బైక్‌పై  ప్రయాణిస్తున్నాడు. ఈ క్రమంలో బైక్ అదుపుతప్పి రోడ్డు మధ్యలో ఉన్న డివైడరును ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు సూరజ్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న గచ్చిబౌలి పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని యువకుడిని సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో మంగళవారం ఉదయం సూరజ్ మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ సంఘటనపై మృతుడి సోదరుడు రణధీర్ సింగ్ గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. యువకుడి ఆకస్మిక మృతితో గౌలిదొడ్డి ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రోడ్డు ప్రమాదాలపై మరింత అప్రమత్తత అవసరమని పోలీసులు సూచిస్తున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *