జలవిహార్‌ ఆర్వో ప్లాంట్ లో పేలుడు

– ఇద్దరు కార్మికులకు గాయాలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 8: జలవిహార్‌లో ఆర్వో ప్లాంట్ పేలుడు ఘటన కలకలం రేపింది. నీటిని సరఫరా చేసే ఆర్వో ప్లాంట్ ఒక్కసారిగా పేలడంతో సందర్శకులు భయాందోళనకు గురయ్యారు. బుధవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. జలవిహార్‌కు నీటిని సరఫరా చేసే ఆర్వో ప్లాంట్ పేలింది. ఈ ఘటనలో ప్లాంట్ దగ్గర పనిచేస్తున్న ఇద్దరు సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. పేలుడు ధాటికి ప్లాంట్ పరికరాలన్నీ తునాతునకలయ్యాయి. ఆర్వో ఫిల్టర్ లేదా కంప్రెషర్‌లో అధిక ప్రెషర్ ఏర్పడడమే పేలుడుకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. గాయపడిన ఇద్దరినీ హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వేసవి  కావడంతో జలవిహార్‌కు సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉంటోంది. ఇలాంటి సమయంలో ప్రమాదం జరగడం పట్ల సందర్శకులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. ఈ ఘటనపై  దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *