పోలీస్ సిబ్బందికి రివార్డులు

– అందజేసిన‌ అడిషనల్ డీజీపీ

హైదరాబాద్,ప్రజాతంత్ర‌,డిసెంబర్ 23: తెలంగాణ పోలీసు శాఖలో సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగిస్తూ, విశేష ప్రతిభ కనబరిచిన అధికారులకు, సిబ్బందికి మంగళవారం రివార్డులు అందజేశారు. డిజిపి కార్యాలయంలో నిర్వహించిన మెగా రివార్డు మేలాలో  భాగంగా అడిషనల్ డీజీపీ (టెక్నికల్ సర్వీసెస్) వి.వి శ్రీనివాసరావు ఉత్తమ సేవలు అందించిన 160 మంది సిబ్బందికి ప్రశంసా పత్రాలను అందజేశారు. పోలీసు స్టేషన్లు, జిల్లా యూనిట్ల స్థాయిలో సాంకేతికతను ప్రజలకు చేరువ చేయడంలో కీలక పాత్ర పోషించిన వారికి ఈ సందర్భంగా ప్రశంసా పత్రాలు, రివార్డులు అందజేశారు. ఐటీ సెల్ కోఆర్డినేటర్లు, ఐటీ కోర్ టీమ్ సభ్యులు: 80 మందికి, టెక్ టీమ్ సభ్యులు (ఈ-కాప్స్): 71 మందికి, ఐటీ&సీ, ఇతర సాంకేతిక సహాయక సిబ్బంది: 09 మందికి రివార్డులను అందజేశారు. ఈ సందర్భంగా అడిషనల్ డీజీపీ మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో డిజిటల్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంలోనూ, ‘ఈ-పోలీసింగ్’ ప్లాట్‌ఫారమ్‌లు నిరంతరాయంగా పనిచేసేలా చూడటంలోనూ ఈ సిబ్బంది కృషి అభినందనీయమన్నారు. డేటా ఆధారిత విచారణ, పౌర సేవలను మరింత పారదర్శకంగా అందించడంలో సాంకేతిక విభాగం పోలీసు శాఖకు వెన్నెముకలా నిలుస్తోందని కొనియాడారు. వినూత్న ఆవిష్కరణలను ప్రోత్సహించడం ద్వారా ‘స్మార్ట్ పోలీసింగ్’ లక్ష్యాలను చేరుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఐటీ&సీ ,ఎస్పీ (ఇన్‌ఛార్జ్ డీఐజీ) కిరణ్ కుమారి, ఎస్పీ (పీసీ&ఎస్) జి.లక్ష్మీ గౌతమి, అడిషనల్ ఎస్పీ రవిచంద్ర, డీఎస్పీలు ఖాజా మొయినుద్దీన్, నవీన్ కుమార్, శాంతి తదితరులు పాల్గొన్నారు.
———————————————————————————————————————————————————————————–

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *