– విపత్తుల సమయంలో అప్రమత్తంగా ఉండాలి
– కామారెడ్డి వరదల్లో అధికారుల కృషి ప్రశంసనీయం
– నష్టానికి సంబంధించి నివేదికలు సిద్దంచేయాలి
– కేంద్రం నుంచి సాయం అందేలా చూడాలి
– యూరియా కోసం పడిగాపులు పడకుండా చూడండి
– కామారెడ్డిలో అధికారులతో సిఎం రేవంత్ సమీక్ష
కామారెడ్డి,ప్రజాతంత్ర,సెప్టెంబరు4: వరదలు, విపత్తుల సమయంలో అధికారులు సమన్వయంతో పనిచేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఇటీవల కురిసిన వర్షం, వరదలతో కామారెడ్డి జిల్లాకు తీవ్ర నష్టం జరిగిందన్నారు. పంటలకు, ఆస్తులకు తీవ్ర నష్టం చేకూరిందన్నారు. గురువారం సీఎం రేవంత్ రెడ్డి కామారెడ్డి జిల్లాలో పర్యటించారు. ఇటీవల కురిసిన భారీ వర్షానికి కామారెడ్డి వణికిపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కామారెడ్డి జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించడంతో పాటు వరద బాధితులను సీఎం రేవంత్ పరామర్శించారు. అనంతరం అధికారులతో సక్ష నిర్వహించి.. పంట, ఆస్తి నష్టం వివరాలు అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్‌లో మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ప్రభుత్వ యంత్రాంగం వెంటనే స్పందించడం ద్వారా వరదల వల్ల ఎక్కువ నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు. ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్, స్థానిక యంత్రాంగం సహాయక చర్యల్లో పాల్గొన్నాయని తెలిపారు. సమస్య వచ్చినప్పుడు అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. వరదలతో నష్టపోయిన అన్ని నియోజకవర్గాలకు సాయం అందిస్తామని హా ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ రూల్స్ ప్రకారం వరద నష్టం వివరాలను నమోదు చేయాలని అధికారులకు సూచించారు. పాఠశాలలు, వైద్యం, ప్రాజెక్టులపై ప్రణాళిక ప్రకారం పని చేయాలని చెప్పారు. యూరియా సరఫరాలో అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. వరద నష్టం ఎక్కువగా జరగకుండా అప్రమత్తమై, సరైన సమయంలో స్పందించి చర్యలు చేపట్టిన అధికారులను ఆయన అభినందించారు. పరిపాలనా సౌలభ్యం కోసం వివిధ శాఖలను ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. క్రైసిస్ మేనేజ్మెంట్ సమయంలో శాఖల మధ్య సమన్వయం ఉండాలని సూచించారు. జిల్లా కలెక్టర్లు వివిధ శాఖలతో సమన్వయ సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు. సమస్య వచ్చినప్పుడు రాజకీయాలకు అతీతంగా మానవత్వంతో వ్యవహరించాలని ఆయన చెప్పుకొచ్చారు. ఈ సక్షా సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు పకడ్బందీగా అమలు చేయాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాబోయే 15 రోజుల్లో మరోసారి సక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఇంచార్జ్ మంత్రి సీతక్క ప్రత్యేక సక్ష నిర్వహిస్తారని చెప్పారు. ప్రజా ప్రతినిధులు తమ నియోజకవర్గాలకు సంబంధించిన సమస్యలను సక్షలో సీతక్క దృష్టికి తీసుకురావాలని సూచించారు. నిబంధనల ప్రకారం కేంద్ర ప్రభుత్వం నుంచి రిలీఫ్ ఫండ్‌ను రాబట్టుకోవాలని చెప్పుకొచ్చారు. భవిష్యత్‌లో ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా శాశ్వత ప్రణాళికలు రూపొందించడానికి అధికారులు కృషి చేయాలని సీఎం వివరించారు. యూరియా రైతులు ఎక్కువ సేపు లైన్లో నిలబడి అలిసిపోతున్నారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అలిసిపోవడం వల్ల అసలు యూరియా లేదని చెప్తున్నారని పేర్కొన్నారు. యూరియా సరిపడా అందుబాటులో ఉందని చెప్పుకొచ్చారు. అందరూ ఒకే దగ్గర ఉండేసరికి యూరియా కోసం ఉన్న లైన్ పెద్దగా కనిపిస్తుందని స్పష్టం చేశారు. లైన్లో చివర ఉన్న వారికి యూరియా ఇవ్వాలంటే 8 గంటల సమయం పడుతుందని వివరించారు. ఆ 8 గంటలు లైన్లో నిలబడలేక, సహనం కోల్పోయి.. ధర్నాలు చేస్తున్నారని అన్నారు. రైతులను ఎవరో ఒకరు తీసుకెళ్లి కావాలనే రోడ్ల ద కూర్చో పెడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. అలా కాకుండా వారికి టోకెన్లు ఇచ్చి సమయానికి యూరియా సరఫరా చేయాలన్నారు. సక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్‌తో పాటు మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పిసిసి చీఫ్ మహేశ్ గౌడ్, సలహాదారు షబ్బీర్ అలీ తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





