గ్రామస్థాయి వ‌ర‌కు రెవెన్యూ సేవ‌లు

– మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి

హైద‌రాబాద్, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 4 :  గ్రామ‌ స్థాయిలో రెవెన్యూ వ్య‌వ‌స్ధ‌ను పున‌రుద్ధ‌రి స్తామ‌ని ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీని గ్రామ‌పాల‌ నాధికారుల (జీపీవో)  నియామ‌కంతో నిల‌బెట్టుకున్నామ‌ని రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి అ న్నారు. రెవెన్యూ వ్యవ‌స్ధను  బ‌లోపేతం చేస్తున్నామ‌ని ఇందులో భాగంగా  జీపీవో సేవ‌ల‌ను ఒక‌టి రెండు రోజు ల్లో అందుబాటులోకి తీసుకువ‌స్తున్నామ‌న్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  చేతుల మీదు గా ఈనెల 5వ తేదీ సాయంత్రం 4 గంట‌ల‌కు జీపీవోల‌కు హైటెక్స్‌లో నియామ‌క ప‌త్రాలను అంద‌జేస్తామ‌న్నారు.  గురువారం స‌చివాల యంలో   రెవెన్యూ అధికారుల‌తో నిర్వహించి న సమీక్షలో ఆయ‌న మాట్లాడుతూ జీపీవోలుగా విధులు నిర్వహించ‌డానికి ఆసక్తి చూపిన  విఆర్వో, వి.ఆర్.ఎ ల‌కు రెండు విడ‌త‌ల్లో నిర్వ హించిన రాత ప‌రీక్షల్లో 5,106 మంది ఎంపి క‌య్యార‌ని తెలిపారు. రెవెన్యూ, స‌ర్వే విభాగా నికి మధ్య అవినాభావ సంబంధం ఉం ద‌ని స‌ర్వే విభాగం బ‌లోపేతంతోనే రెవెన్యూ వ్యవ‌స్ధ లో మెరుగైన సేవ‌లు అందించ‌గ‌లు గుతామ‌ని దీనిని దృష్టిలో పెట్టుకొని స‌ర్వేవిభాగాన్ని బ‌లోపేతం చేస్తున్నామ‌న్నారు. రిజిస్ట్రేష‌న్ స‌మ‌యంలో స‌ర్వే మ్యాప్ త‌ప్పనిస‌రి చేసిన నేప‌ ధ్యంలో ఇందుకు అవ‌స‌ర‌మైన లైసెన్స్‌డ్ స‌ర్వే య‌ర్ల సేవ‌లు కూడా వ‌చ్చేనెల మొద‌టివారం నాటికి అందుబాటులోకి తీసుకురాబోతు న్నామ‌ని ప్రక‌టించారు. ఇందుకు సంబంధించి ఇప్ప‌టికే మొద‌టి విడ‌త‌లో 7వేల మందికి శిక్ష‌ణ ఇవ్వ‌డం అర్హ‌త ప‌రీక్ష పూర్త‌య్యాయ‌ని  40 రోజుల పాటు నిర్వ‌హిస్తున్న‌ అప్రెంటిస్ శిక్ష‌ణ కూడా త్వ‌ర‌లో పూర్తి చేసుకోబోతున్నార‌ని తెలిపారు.  గ‌త‌ నెల 18వ తేదీ నుంచి రెండ‌వ విడ‌త‌లో మూడు వేల మందికి 21 జిల్లాల్లో శిక్షణ ప్రారంభించా మ‌న్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *