రేవంత్‌లో అస‌హ‌నం పెరిగిపోయింది

– మిత్ర‌భేదం ట్రిక్‌లు ప‌నిచేయ‌వు
– నా చేతిలో వుండేది గులాబీ జెండానే
-మాజీ మంత్రి హ‌రీష్‌రావు

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 18: పంచాయతీ ఎన్నికల ఫలితాలు చూసిన రేవంత్ రెడ్డి ఫ్రస్టేషన్ పీక్స్ కు చేరింది. రోజురోజుకీ పరిస్థితులు చేజారి పోతున్నాయనే సత్యం జీర్ణం కాక అవాకులు చెవాకులు పేలుతూ అక్కసు వెళ్లగక్కిండని మాజీ మంత్రి హ‌రీష్‌రావు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. త్వరలోనే తనకు పతనం తప్పదనే సంగతి అర్థమై ఆగమాగం అవుతున్నడు. త్వరలోనే తన కుర్చీ ఊడుతుందని, తన దోపిడీ ఆగిపోతుందనే భయంతో రేవంత్ రెడ్డి ఇవాళ్టి ప్రెస్ మీట్ లో అడ్డగోలుగా వాగిండ‌న్నారు.  నాకు, కేటీఆర్ కు మధ్య మిత్ర బేధం సృష్టించాలని, తద్వారా బీఆర్ఎస్ ను బలహీన పరచాలని ఒక చీప్ ట్రిక్ ప్లే చేస్తున్నడ‌ని ఆరోపించారు. నీ కుట్రలు, కుత్సితాలు ఫలించవు గాక ఫలించవు. అనేక సార్లు చెప్పినా, మళ్లీ చెబుతున్నా ఎప్పటికైనా హరీశ్ రావు గుండెల్లో ఉండేది కేసీఆరే. హరీశ్ రావు చేతిలో ఉండేది గులాబీ జెండానేన‌ని స్ప‌ష్టం చేశారు. నీ దాష్టీకాలు, దుర్మార్గలకు వ్యతిరేకంగా నేనూ, కేటీఆర్ మరింత సమన్వయంగా, మరింత సమర్థవంతంగా రెట్టించిన ఉత్సాహంతో పోరాడతామ‌న్నారు. నీ అవినీతిని ఎండగడుతం. అసమర్థతను నిలదీస్తం. ఉద్యమ కాలం నుంచి నేటి దాకా తెలంగాణకు తీరని ద్రోహం చేస్తున్న నిన్ను, నీ కాంగ్రెస్ ను గద్దె దించుతమ‌న్నారు. నా లక్ష్యమైనా, కేటీఆర్ లక్ష్యమైనా, లక్షలాది గులాబీ సైనికుల లక్ష్యమైనా ఇదే. బీఆర్ఎస్ విజయపథంలో పురోగమించడం ఖాయం మరోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయమ‌న్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను సంపూర్ణంగా నెరవేర్చడం ఖాయం. కమీషన్లు, రియల్ ఎస్టేట్ దందాలే కాదు..ప్రజలకు అక్కరకు వచ్చే పనులు చేయి. లేకుంటే ఉద్యమ ద్రోహి గానే కాదూ, చేవలేని, చేతగాని ముఖ్యమంత్రిగా కూడా చరిత్రలో నిలిచిపోతవన్నారు.

———————————————————————————————————————————————————————

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *