– ఆకస్మికంగా వొచ్చి పరిశీలించిన సిఎం
– భక్తులకు అభివాదం చేస్తూనే సూచనలు
హైదరాబాద్,ప్రజాతంత్ర,సెప్టెంబర్6: హుస్సేన్ సాగర్ వద్ద నిమజ్జనాలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వయంగా పరిశీలించారు. భక్తులు, సందర్శకులు క్షేమంగా ఇళ్లకు చేరుకోవాలని సీఎం విజ్ఞప్తి చేశారు. భాగ్యనగర్ ఉత్సవ సమితి వేదికపై నుంచి భక్తులకు అభివాదం చేశారు. ‘గణపతి బప్పా మోరియా’ అంటూ భక్తులతో కలిసి నినాదాలు చేశారు. క్రేన్ నెం.4వద్ద నిమజ్జనాలను పరిశీలించారు. నిమజ్జనం ఏర్పాట్లను కలెక్టర్ హరిచందన సీఎంకు వివరించారు. ఈ సందర్భంగా విధుల్లో పాల్గొన్న అన్ని విభాగాల సిబ్బందిని సీఎం అభినందించారు. నిమజ్జనాలు పూర్తయ్యే వరకు ఇదే స్ఫూర్తితో పనిచేయాలని సూచించారు. ముందస్తు సమాచారం లేకుండా సాదాసీదాగా సీఎం రేవంత్‌రెడ్డి హుస్సేన్ సాగర్ వద్ద ప్రత్యక్ష కావడంతో భక్తులు ఆశ్చర్యానికి గురయ్యారు. గణేశ్ నిమజ్జనాల సందర్భంగా హుస్సేన్ సాగర్ వద్దకు సీఎం వచ్చి ఏర్పాట్లను పరిశీలించడం పట్ల భాగ్యనగర్ ఉత్సవ్ సమితి ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. నగర వ్యాప్తంగా వినాయక నిమజ్జనాలు అంగరంగ వైభవంగా కొనసాగాయి. ఈ నేపథ్యంలో ట్యాంక్‌బండ్ వద్ద జరుగుతున్న గణేష్ నిమజ్జనాల వేడుకను సీఎం రేవంత్ రెడ్డి సందర్శించారు. ఎవరికీ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా స్వయంగా ట్యాంక్‌బండ్‌కు సీఎం వచ్చినట్లు సమాచారం. నిమజ్జనాల నేపథ్యంలో అధికారులు చేసిన భద్రత ఏర్పాట్లను సీఎం పరిశీలించారు. అనంతరం ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని భక్తులను అడిగి తెలుసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సాధారణ వ్యక్తిగా ట్యాంక్ బండ్ వద్దకు వచ్చి నిమజ్జనం ఏర్పాట్లు పరిశీలించారు. రేవంత్ రెడ్డి రావడంతో భారీగా ప్రజలు తరలివచ్చారు. ప్రజలకు అభివాదం చేస్తూ.. ముందుకు కదిలారు. అత్యంత తక్కువ సంఖ్యలో భద్రత సిబ్బందితో.. మూడు కార్ల ఎస్కార్ట్‌తో సీఎం ట్యాంక్‌బండ్‌కు చేరుకున్నారు. నిమజ్జనం జరుగుతున్న తీరును అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. గణేష్ నిమజ్జనాల సందర్భంగా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందుకు వెళ్లాలని తెలిపారు. వినాయక నిర్వాహకులు, ప్రజలు అధికారులకు సహకరించాలని సీఎం స్పష్టం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





