కుల గణనపై నిపుణుల కమిటీ నివేదికపై సీఎం
హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 19: కులగణన సర్వేపై స్వతంత్ర నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక కేవలం డేటా కాదు.. ఇది తెలంగాణ మెగా హెల్త్ చెకప్ అని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. తమ నాయకుడు రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో కులగణన సర్వే విజయవంతంగా నిర్వహించామన్నారు. రాష్ట్రంలో బలహీన వర్గాల అభ్యున్నతికి, సామాజిక న్యాయాన్ని అమలు చేసేందుకు ఈ నివేదిక ఉపయోగపడుతుందని తెలిపారు. అర్బన్, రూరల్ ఏరియాల మధ్య వ్యత్యాసాలు, ఇందుకు కారణాలపై నిపుణుల కమిటీ అధ్యయనం చేయాలని, ప్రజల అవసరాలను గుర్తించి సరైన సూచనలు ఇవ్వాలని కమిటీని కోరుతున్నానన్నారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని రేవంత్‌రెడ్డి అన్నారు.



