– తిరుమలలో వైభవంగా ముక్కోటి ఏకాదశి
– అర్థరాత్రి నుంచే ప్రత్యేక దర్శనాలు
– భారీగా తరలివచ్చిన సినీ, రాజకీయ ప్రముఖులు
తిరుమల, డిసెంబర్ 31: ముక్కోటి ఏకాదశి పండుగ వైభవంగా జరిగింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలుగు రాష్టాల్లోని పలు దేవాలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. తెల్లవారుజామునే ఉత్తర ద్వారాలు తెరుచుకోవడంతో స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. గోవింద నామస్మరణతో ఆలయాలు మార్మోగాయి. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో అర్ధరాత్రి 12:05 గంటలకు వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. రాజకీయ, సినీ ప్రముఖులు ఉత్తర ద్వారం గుండా గోవిందుడిని దర్శించుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా, కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడులు శ్రీవారిని దర్శించుకున్నారు. అనేకమంది రాజకీయ, సినీ ప్రముఖులు కూడా తెల్లవారుజామునే శ్రీనివాసుడి దర్శనం చేసుకున్నారు. ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు, మంత్రులు నిమ్మల రామానాయుడు, అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, కొండపల్లి శ్రీనివాస్, అనగాని సత్యప్రసాద్, కొల్లు రవీంద్ర, సవిత, తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మెగా స్టార్ చిరంజీవి సతీమణి సురేఖ, బాలకృష్ణ సతీమణి వసుంధర, నటులు రాజేంద్రప్రసాద్, నారా రోహిత్, శివాజీ, హీరోయిన్ శ్రీలీల, నటి హేమ, నిర్మాతలు డి.వి.వి.దానయ్య, బండ్ల గణేష్, ఇండియన్ క్రికెటర్ తిలక్ వర్మ, సూర్య కుమార్ యాదవ్, చాముండేశ్వరినాథ్, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్, కళ్యాణి, దువ్వాడ శ్రీనివాస్, మాధురి, మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రోజా, ఎంపీలు మిథున్ రెడ్డి, డీకే అరుణ, ఎమ్మెల్యేలు రాజాసింగ్, మల్లారెడ్డి, రాజ్యసభ మాజీ సభ్యుడు సంతోష్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





