– తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు రండంటూ ఆహ్వానం
దిల్లీ, ప్రజాతంత్ర, డిసెంబర్ 3: కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ఎంపీ ప్రియాంక గాంధీలతో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి దిల్లీలో బుధవారం భేటీ అయ్యారు. హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో ఈనెల 8, 9 తేదీల్లో నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు హాజరు కావాల్సిందిగా ప్రత్యేకంగా ఆహ్వానం పలికారు. భవిష్యత్తులో తెలంగాణ అభివృద్ధి, ఆదాయ వృద్ధి లక్ష్యంగా రూపొందించిన తెలంగాణ రైజింగ్ -2047 విజన్ డాక్యుమెంట్ గురించి వివరించి ఆహ్వాన పత్రికను అందజేశారు. వారికి జ్ఞాపికలను బహూకరించారు. పార్టీ అగ్రనేతలను కలిసిన వారిలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు, పలువురు ఎంపీలు, ఏఐసీసీ తెలంగాణ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌లు కూడా ఉన్నారు.
సోనియాకు ఆహ్వానం
రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని కలిసిన అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోనియా గాంధీని కూడా ఆమె నివాసానికి వెళ్లి కలిశారు.
ఈ నెల 8,9న ఫ్యూచర్ సిటీలో నిర్వహించే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు రావాల్సిందిగా ఆమెకు ఆహ్వాన పత్రిక అందజేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




