రేవంత్ వ‌న్నీ అబ‌ద్ధాలే

-ఎల్లంప‌ల్లిని పూర్తి చేసింది బీఆర్ ఎస్ ప్ర‌భుత్వం
– కేసీఆర్ విజ‌యాల‌ను త‌న గొప్ప‌లుగా చెప్పుకుంటున్న రేవంత్‌
– విరుచుకుప‌డ్డ హ‌రీష్‌రావు

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 9: రేవంత్ రెడ్డి  నోరు విప్పితే అబద్ధాలు తప్ప ఏం లేదని రుజువయింద‌ని మాజీ మంత్రి హ‌రీష్‌రావు అన్నారు. మంగ‌ళ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ నిన్న రేవంత్ రెడ్డి ప్రారంభించిన ట్యాంకులు కేసీఆర్  హయాంలో ప్రారంభించినవ‌ని గుర్తుచేశారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు మేమే కట్టామంటున్నారు. మీలాగా చిన్నగా ఆలోచించి పేర్లు మార్చాలని అనుకోలేదు. టిఆర్ఎస్ వచ్చిన తర్వాత నీటిపారుదుల శాఖ మంత్రిగా నేనే ఉన్నాను. ఎల్లంపల్లి ప్రాజెక్టు హై లెవెల్ బ్రిడ్జి పూర్తి కాలేదు. ఆర్అండ్ఆర్ పూర్తి కాలేదు. భూముల సేక‌ర‌ణ‌ పూర్తి కాలేదు. గ్రామ ప్రజలను ఖాళీ చేయించలేదు. టిఆర్ఎస్ వచ్చిన తర్వాత ఎల్లంపల్లి ప్రాజెక్టును రూ.2052 కోట్లతో పూర్తి చేసి 2016లో పూర్తిస్థాయిలో 20 టీఎంసీల నీళ్లు నింపాం. నిన్న నువ్వు చేసిన శంకుస్థాపన చేసిన దానికి కూడా మేము నిర్మించిన కాళేశ్వరం నీళ్లనే తీసుకెళ్తున్నావ్. ఎల్లంపల్లి కెపాసిటీ 20 టీఎంసీలు డెడ్ స్టోరేజ్ మూడు టీఎంసీలు. మిగిలిన 17 టీఎంసీల్లో సొంత ఆయకట్టు 1,65,000 ఎకరాలు అంటే 12 టిఎంసిలు పోతాయి. ఎన్టీపిసి విద్యుత్ ఉత్పత్తికి 6.5 టీఎంసీలు. మంచిర్యాల నియోజకవర్గంలో గూడెం లిఫ్ట్కు 3టీఎంసీలు. లోకల్లో రామగుండం లిఫ్ట్ కు ఒక టిఎంసి వాడుకుంటాం. దానికి సామర్ధ్యం కంటే ఎక్కువ వాడుతున్నాం ఇప్పటికీ. ఎల్లంపల్లి కెపాసిటీకి మించి మరో 20 టీఎంసీలు హైదరాబాద్ కి ఎలా తెస్తావు రేవంత్ రెడ్డి? ఎవరి చెవిలో పువ్వులు పెడుతున్నావ్? ఎందుకు గోబల్స్ ప్రచారం? ముఖ్యమంత్రి కుర్చీకున్న గౌరవాన్ని తగ్గిస్తున్నావు. ఎల్లంపల్లి నుండి మల్లన్నసాగర్ కు నీళ్లు గాలిలో వస్తున్నాయా ? ఎల్లంపల్లిలో మేడారం దగ్గర మోటర్లు ఆన్‌ చేస్తే మేడారం రిజర్వాయర్లో పడతాయి. లక్ష్మీ పంప్ హౌస్ ఆన్ చేస్తే వరద కాలువకు,  అక్కడి నుంచి మిడ్ మానేరుకు, అక్కడి నుంచి అనంతగిరి రిజర్వాయర్‌కు వస్తాయి. అక్కడనుండి రంగనాయక సాగర్ కు వస్తాయి. రంగనాయక సాగర్ నుండి మళ్లీ మోటార్ ఆన్ చేస్తే మల్లన్న సాగర్ కు వస్తాయి. ఎల్లంపల్లి నుండి మిడ్ మానేరు దాకా కూడా కెనాల్స్ గాని, గ్రావిటీ కెనాల్ కానీ, రిజర్వాయర్లు గాని, సబ్ స్టేషన్లు గాని, పంప్ హౌస్ లు గాని నిర్మించింది బీఆర్ఎస్ ప్ర‌భుత్వ‌మే. కాళేశ్వరంలో భాగంగానే నిర్మించాం. కేసిఆర్ ముందు చూపుతో హైదరాబాద్ మంచి నీటి కోసం మల్లన్న సాగర్లో స్లూయిస్ కూడా నిర్మించి పెట్టిండు. గండిపేట దగ్గర కొబ్బరికాయ కొట్టినవంటే ఆ గండిపేటకు హిమాయత్ సాగర్ కి వచ్చే నీళ్లు కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు. అవి కాళేశ్వరం మోటార్ల ద్వారా వచ్చే నీళ్లు. కాళేశ్వరం అంటే మూడు బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్ స్టేషన్లు, 21 పంప్ హౌస్ లు, 98 కి.మీ ప్రెజర్ మెన్, 203 కి.మీ టన్నెలు, 1531 కి.మీ గ్రావిటీ కెనాల్స్. ఈ 15 రిజర్వాయర్లలో ఒక రిజర్వాయర్ మల్లన్న సాగర్. ఇది కాళేశ్వరంలో అంతర్భాగం. కాళేశ్వరం కోసం ఖర్చు చేసిన రూ.93 వేల కోట్లలో నిర్మించింది మల్లన్న సాగర్. కేసీఆర్ నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ పెట్టి ఉద్యోగ నియామక ప్రక్రియ పూర్తి చేస్తే కేవలం కాగితం ఇచ్చి ఈ ఉద్యోగాలు నేను ఇచ్చిన అని చెప్పుకుంటున్నాడు రేవంత్ రెడ్డి.  ఖమ్మం జిల్లా సీతారామ ప్రాజెక్టు మూడు పంప్ హౌస్ లు కట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం. టన్నెల్సు, సబ్ స్టేష‌న్లు, కెనాల్స్ పూర్తి చేసింది బీఆర్ఎస్. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి బటన్ నొక్కి సీతారామ ప్రాజెక్టు మేమే నిర్మించినమని చెప్పుకుంటున్నారు.. రంగనాయక సాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ దగ్గర మీ మంత్రులే నీళ్లు విడుదల చేసి నెత్తి మీద చల్లుకుంటున్నది నిజం కాదా.. మల్లన్న సాగర్ 2008,2009లో రాజశేఖర్ రెడ్డి కట్టిండు అని అంటున్నాడు.. అనంతగిరి 1.70టీఎంసీ, ఇమాంబాద్ రిజర్వాయర్ 1.5 టీఎంసీ, తడకపల్లి రిజర్వాయర్ 1 టీఎంసీ, తిప్పారం రిజర్వాయర్ 1 టీఎంసీ అన్ని కలిపి ఐదు టీఎంసీలే. ఐదు టీఎంసీలు మాత్రమే ప్రాణహిత చేవెళ్ల డీపీఆర్ లో ప్రతిపాదించారు. మల్లన్న సాగర్ కెపాసిటీ 50 టీఎంసీలు. కేంద్ర ప్రభుత్వానికి 2008లో డీపీఆర్ పంపితే 2012లో డీపీఆర్ ను తిప్పి పంపింది సీడబ్ల్యుసీ. ఈ ఐదు టి.ఎం.సీల సామర్థ్యంతో 16 ఎకరాలకు నీళ్లు పారవు. రిజర్వాయర్లకు కెపాసిటీ పెంచుకోండి అని డీపీఆర్ ను రిజెక్ట్ చేసింది సీడబ్ల్యూసీ. రాజశేఖర్ రెడ్డి బతికుంటే ఈ అబద్ధాలు విని సిగ్గుతో తలదించుకునేవాడు.. సాగునీటి అవసరాల కోసం కేసీఆర్  50 టీఎంసీల మల్లన్న సాగర్ నిర్మించారు. ఇదే రేవంత్ రెడ్డి మల్లన్న సాగర్ కట్టవద్దని 48 గంటలకు దీక్ష చేసిండు.. 2016లో మల్లన్న సాగర్ కట్టాలంటే ప్రజలందరూ రెఫరండం తీసుకుని కట్టాలని రేవంత్ రెడ్డి దీక్ష చేసిండు. మల్లన్న సాగర్ కడితే ఆ ప్రాజెక్టు కింద ఒక్కొక్క రైతుకు రెండు ఎకరాలు పండే భూమిని ఇవ్వాలి అని అన్నాడు. మూసిలో దాదాపు 300 ఇళ్లు ఖాళీ చేపించిండు. మల్లన్నసాగర్కు అడ్డం పడ్డది నువ్వు. మల్లన్న సాగర్ లో ప్రజలందరినీ ఒప్పించి మెప్పించి 99 శాతం ప్రజలు కాన్సెంట్ అవార్డు ఇష్టపూర్వకంగా ఇచ్చారు. మూసిలో మొన్న 300 ఇళ్లను కూలగొట్టిన రేవంత్ రెడ్డి, చివరికి కేసీఆర్  కట్టించిన డబల్ బెడ్ రూములు మాత్రమే వాళ్ళకి ఇచ్చి ఒక రూపాయి కూడా ఇవ్వలేదు. మల్లన్న సాగర్లో భూమి కోల్పోయిన వారికి అమ్ముకునే హక్కులతో కూడిన 250 గజాల్లో సొంత ఇంటిని కట్టించినం. రెండున్నర లక్షల ఆర్అండ్ఆర్ ప్యాకేజ్ ఇచ్చినం. 18 దాటిన వారికి కూడా నష్టపరిహారం ఇచ్చింది టిఆర్ఎస్ ప్రభుత్వం. మూసిలో ఖాళీ చేయించిన వారికి రూ.25 వేల చెక్కు ఇచ్చిండు.. ఆ చెక్కులు కూడా బౌన్స్ అయినయ్.. కేసీఆర్  దేశంలో ఎక్కడలేని విధంగా ఆర్ అండ్ ఆర్ కాలనీ మల్లన్న సాగర్ నిర్వాసితులకు కట్టించాడు. మూసి నిర్వాసితులకు 2013 చట్ట ప్రకారం నష్టపరిహారం చెల్లించాలి.. నువ్వు ఎన్ని కుట్రలు చేసినా కేసీఆర్ గారు ఒక దీక్షతో మల్లన్న సాగర్ కట్టిండు. మల్లన్న సాగర్ ఈరోజు హైదరాబాదుకి, రైతులకు ఒక వరంగా మారింది. మల్లన్న సాగర్ కాళేశ్వరంలో భాగం కాదన్న విషయాన్ని అబద్దంగా మార్చే ప్రయత్నం చేయ‌డం దారుణం. హైదరాబాదుకు బీఆర్ఎస్ ఒక చుక్క మంచినీళ్లు తేలేదు అని మరో అబద్ధం చెప్పిండు. మంచినీటి కోసం హైదరాబాదులో నీటి యుద్ధాలు జరిగేది. టిఆర్ఎస్ వచ్చిన తర్వాత 7,000 కోట్లను హైదరాబాద్ మంచినీటి కోసం ఖర్చు చేశాం. మీరు ఎల్లంపల్లి నుండి హైదరాబాదుకు తెచ్చే మంచినీటి పథకం 2008లో ప్రారంభమై ఏడేళ్లయినా పూర్తి కాలేదు.. ఎల్లంపల్లి నుండి హైదరాబాదుకు మంచినీళ్లు తెచ్చే లైన్ లో రైల్వే, మిలిటరీ ల్యాండ్ల పర్మిషన్లు పెండింగ్ ఉంటే రెండు సంవత్సరాల్లో రైల్వే అధికారులను, మిలిటరీ అధికారులను ఒప్పించి మెప్పించి హైదరాబాద్‌కు వాటర్ సప్లై స్కీమ్ను పూర్తి చేశాము. కృష్ణ ఫేజ్ 4 పనులను కూడా పూర్తి చేసి కృష్ణ నీళ్లను కూడా హైదరాబాద్ తెచ్చింది కేసీఆరే. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రూ.1600 కోట్లు ఖర్చు చేసి 56 రిజర్వాయర్లు, 2600 కిలోమీటర్ల పైప్ లైన్లు వేసినం.. ఓఆర్ఆర్ ఫేస్ వన్, ఫేస్ టూలో రూ.2000 కోట్లు ఖర్చు చేసి ఓహెచ్ఎస్ఆర్ పైపులైన్లు వేసాము. నాగార్జునసాగర్ డెడ్ స్టోరేజ్ నుంచి కూడా నీళ్లు తీసుకోవాలని.. భవిష్యత్తులో వందేళ్ల కోసం నాగార్జునసాగర్ నుండి 60 టీఎంసీల నీళ్లు తీసుకోవాలని సుంకిశాలను ప్రారంభించినం. మీరు ప్రాణహిత చేవెళ్ల రంగారెడ్డి జిల్లాలో పెట్టింది 1,50,000 ఎకరాలకే. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా ఆరు లక్షల 50వేల ఎకరాలకు మేము ప్రతిపాదించాం.. వికారాబాద్, పరిగి, తాండూర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో లేవు.. కృష్ణా నదిలో నీటి వాటా కోసం రంగారెడ్డి కృష్ణ పరివాహక ప్రాంతంలో వస్తుంది.. సప్లమెంటేషన్ చూపిస్తే ట్రిబ్యునల్ ముందు మన వాదన వీగిపోయే అవకాశం ఉంటుందని కృష్ణ నదిలో మాకు వాటా ఉందని గ్రావిటీ ద్వారా ఉద్దండపూర్ రిజర్వాయర్ నుండి 6.5లక్షలు ఎకరాలకు నీళ్లు ఇచ్చే ప్రతిపాదన చేశాం. 2014లో అసెంబ్లీలో బిల్లుపై చర్చలో రేవంత్ రెడ్డి గారు ఏమన్నరో చూద్దాం.. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కోసం 5000 కోట్లు ఖర్చు చేసి తట్టెడు మట్టి కూడా ఎత్తలేదు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం అని రేవంత్ రెడ్డి అసెంబ్లీలో అన్నారు. నిన్నేమో 2008-09లో మల్లన్న సాగర్ రాజశేఖర్ రెడ్డి కట్టిండు అని మరో అబద్ధం చెపుతున్నాడంటూ విమ‌ర్శించారు. కేసీఆర్ కాళేశ్వరం కట్టిండు గనుక మల్లన్న సాగర్ 50 టీఎంసీలతో నిర్మించిండు కాబట్టే నువ్వు హైదరాబాద్కి నీళ్లు తేగలుగుతున్నావ్. 152 మీటర్లకు అగ్రిమెంట్ ఉండంగా కూడా మేడిగడ్డకు ఎందుకు పోయారని ఉత్తంకుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి అన్నారు.. ఈరోజు వారే నిజము ఒప్పుకున్నారు. తుమ్మిడిహట్టి వద్ద 148 మీటర్లకు అగ్రిమెంట్ ఉంది అని అంటున్నారు.. గ్రావిటీ ద్వారా నీళ్లు వస్తాయి అన్నారు కదా తెచ్చి చూపించండి.. 148 మీటర్ల వద్ద బ్యారేజీ కడితే కేవలం 50 టీఎంసీల కంటే మనం ఎక్కువ తీసుకోలేమన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *