ల్యాండ్‌ లూటీ మాఫియాలా రేవంత్‌

– హిల్ట్‌ పాలసీని ఉపసంహరించుకోవాలి
– లేకుంటే ప్రజా ఉద్యమం తప్పదు
– బీజేపీ నేత మహేశ్వర్‌రెడ్డి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 25: రాష్ట్ర సంపదకు కస్టోడియన్‌లా వ్యవహరించాల్సిన సీఎం రేవంత్‌ రెడ్డి రియల్టర్‌గా వ్యవహరిస్తూ హిల్ట్‌ పాలసీ తెచ్చి రూ.6.29 లక్షల కోట్ల స్కాముకు పాల్పడుతూ భూముల గజదొంగలా, ల్యాండ్‌ లూటీ మాఫియా డాన్‌లా వ్యవహరిస్తున్నారని అసెంబ్లీలో బీజేపీ ఫ్లోర్‌ లీడర్‌ ఎ.మహేందర్‌రెడ్డి ఆరోపించారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ ఇండస్ట్రియల్‌ ల్యాండ్‌ చోరీలా ఉన్న ఈ పాలసీని రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని, జీవో-27ను రద్దు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. తక్షణమే అసెంబ్లీని సమావేశపరిచి, హిల్ట్‌ పాలసీపై లోతైన చర్చ జరిగిన తర్వాతే ప్రభుత్వం తదుపరి నిర్ణయం తీసుకోవాలన్నారు. లేకుంటే తెలంగాణలో డెమోక్రసీ లేదని, ఉన్నదంతా క్లెప్టోక్రసీ అని దేశమంతా భావిస్తుందన్నారు. హిల్ట్‌ పాలసీని రేవంత్‌ సర్కార్‌ ఉపసంహరించుకోకపోతే హైదరాబాద్‌ ప్రజలు రోడ్లపైకి వచ్చి సేవ్‌ హైదరాబాద్‌ ఫ్రం ల్యాండ్‌ లూటింగ్‌ అని ఉద్యమించాల్సి వస్తుందని, అలాంటి ప్రజా ఉద్యమానికి బీజేపీ మద్దతు ఇస్తుందని, ముందుండి పోరాడుతుందని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉండగా కొన్ని పారిశ్రామికవాడల్లోని భూముల ఓనర్లకు ఫ్రీ హోల్డ్‌ ఇచ్చింది. వారికే యాజమాన్యపు హక్కులు ఇచ్చిందన్నారు. ఇండస్ట్రియల్‌ ల్యాండ్‌ లూటీ ఎపిసోడ్‌కు బీఆర్‌ఎస్‌ కిటికీలు తెరిస్తే కాంగ్రెస్‌ తలుపులు తెరిచిందని మహేశ్వర్‌రెడ్డి విమర్శించారు. దొంగల పాలన పోయి గజదొంగల పాలన వచ్చింది.. గొర్రెలను తినేటోడు పోయి బర్రెలను తినేటోడు వచ్చిండు.. అని అన్నారు. సీఎం రేవంత్‌ రెడ్డి గ్యాంగ్‌ ముందుగానే 22 పారిశ్రామికవాడల్లో రెక్కీ నిర్వహించి అక్కడున్న సంస్ధలకు చెందిన వారితో అగ్రిమెంట్లు కుదుర్చుకున్న తర్వాత హిల్ట్‌ పాలసీని కేబినెట్‌లో ఆమోదించారని ఆరోపించారు. ఇది ముమ్మాటికీ ఇన్‌సైడర్‌ ట్రేడిరగ్‌ స్కామే. సీఎం రేవంత్‌ రెడ్డి చేస్తున్న ల్యాడ్‌ లూటీని ఆపకపోతే, రేపు తెలంగాణలో బీజేపీి ప్రభుత్వం వచ్చాక ఈ స్కాంపై విచారణ జరిపి రేవంత్‌ రెడ్డితో పాటు ఆయన కేబినెట్‌ స్కామ్‌స్టర్స్‌ను కూడా జైలుకు పంపడం ఖాయం అని ఆయన హెచ్చరించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *