ఫోన్ ట్యాపింగ్‌పై రేవంత్‌కు చిత్తశుద్ది లేదు

– కేసీఆర్‌పై చర్యలకు వెనకాడుతున్నారు
– కరీంనగర్‌లో ఓటేసిన కేంద్ర మంత్రి బండి దంపతులు

కరీంనగర్, ఫిబ్రవరి 11: మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా కరీంనగర్ జ్యోతినగర్ ఎస్‌ఆర్ హైస్కూల్లో కుటుంబ సభ్యులతో కలిసి కేంద్ర మంత్రి బండి సంజయ్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మరోసారి విరుచుకుపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేస్తున్నారో సీఎం సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్‌పై రేవంత్ రెడ్డివి ఊకదంపుడు ప్రసంగాలు మాత్రమే అని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌కు రేవంత్ భయపడుతున్నారా? కేసీఆర్ కుటుంబంపై చర్యలు తీసుకోరా? అని ప్రశ్నించారు. అంతేకాక రేవంత్ రెడ్డికి రాజకీయాల మీద ఉన్న శ్రద్ధ రైతులపై లేదని బండి వ్యాఖ్యానించారు. యూరియా పక్కదారి పడుతున్నా ఏమీ పట్టడం లేదా అని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ నేతలు బ్లాక్‌లో యూరియా అమ్ముకుంటున్నారని ఆరోపించారు. కేంద్రాన్ని విమర్శించడం తప్ప రాష్ట్రం ఏం చేస్తోందని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ద్రోహి అంటూ వ్యాఖ్యానించారు. రైతుల పట్ల బాధ్యత లేదా.. యూరియాపై కనీసం సమీక్ష చేయరా అని నిలదీశారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ హయాంలో రైతులు గోసపడ్డారని మంత్రి అన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *