రాష్ట్ర‌ సంపద కొల్లగొడుతున్న రేవంత్‌

‌- కాంగ్రెస్‌ ఎన్నికల ఫండ్‌ ‌కోసం తరలింపు
– బీజేపీ ఎంపీ ఈటల ఘాటు విమర్శలు

వరంగల్‌,‌ప్రజాతంత్ర,ఏప్రిల్‌4: ‌రాష్ట్ర‌ ప్రజల సంపదను రేవంత్‌ ‌రెడ్డి కొల్లగొడుతున్నారని ఈటల రాజేందర్‌ ఆరోపణలు గుప్పించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల కోసం రాష్ట్ర ప్రజల సంపదను తరలిస్తున్నారని మండిపడ్డారు. ఆరు గ్యారెంటీలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ‌సహా పలు అంశాలపై సీఎంకు ప్రశ్నలు సంధించారు.  ఎన్నికల వేళ ఆరు గ్యారంటీలు- 66 హామీల పేరుతో ప్రజలను ఆయన మోసం చేశారని ఈటల ఆగ్రహం వ్య‌క్తం చేశారు. రాష్ట్ర ప్రజానీకం గంపెడు ఆశలతో కాంగ్రెస్‌కు అధికారం కట్టబెడితే చట్ట సభల్లో ప్రజా సమస్యలు చర్చకు రాకుండా వ్యక్తిగత దూషణలతో కాలం వృథా చేశారన్నారు. గత బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం 2023 నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వలేదని, కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం రెండున్నర ఏళ్లలో రూ.600 కోట్లు మాత్రమే విడుదల చేసిందని ధ్వజమెత్తారు. పేద విద్యార్థుల జీవితాలతో రేవంత్‌ ‌రెడ్డి సర్కార్‌ ‌చెలగాటం ఆడుతోందని విమ‌ర్శించారు. రేవంత్‌ ‌రెడ్డి ఇచ్చిన హామీల అమలు ఎలా సాధ్యమవుతుందని ఎన్నికల వేళ అడిగినప్పుడు తాను చేసి చూపిస్తానని ప్రగల్భాలు పలికారని చెప్పారు. ఇప్పుడు హాడిలు అమలు చేయకుండానే చేసినట్లు చెప్పుకుంటున్నారని విమర్శించారు. వేల కోట్ల విలువ చేసే భూములను ప్రైవేట్‌ ‌వ్యక్తులతో కలిసి సీఎం రేవంత్‌ అమ్ముకుంటున్నారంటూ ఎంపీ ఈటల ‌సంచలన ఆరోపణలు చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *