రేవంత్‌ ‌రెడ్డి జైలుకెళ్లడం ఖాయం

– అందుకే ఓటుకు నోటు ఫైళ్లు దగ్ధం
– బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు ఆరోపణ

మెదక్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్రవరి 9: ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్‌ ‌రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయమని, అందుకే ఫోరెన్సిక్‌ ‌ల్యాబ్‌ను దగ్ధం చేశారని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్‌ ‌రావు అన్నారు. మెదక్‌లో సోమవారం ఎన్నికల ప్రచారం సందర్భంగా మాట్లాడుతూ  సీఎం రేవంత్‌ ‌రెడ్డి డైరెక్షన్‌లోనే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపించారు. ఈ కేసులో జైలుకు వెళ్లకుండా ఉండేందుకే సాక్ష్యాలను మాయం చేశారంటూ మండిపడ్డారు.  ఫోరెన్సిక్‌ ‌ల్యాబొరేటరిలో ఈ ప్రమాదం ప్రమాదవశాత్తు జరిగింది కాదన్నారు. వోటుకు నోటు కేసులో రేవంత్‌ ‌దొరికిపోయిన దొంగ అంటూ  వ్యాఖ్యానించారు. పోలీసుల సహకారంతోనే సీఎం ఈ కుట్రపన్నారని పేర్కొన్నారు. సీఎం రేవంత్‌ ‌డైరెక్షన్‌లోనే పోలీసులు చేసిన దహనకాండ ఇది అని అభివర్ణించారు. రెండున్నరేళ్ల కాలంలో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం చేసింది గుండు సున్నా అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *