ఈవెంట్‌ ‌మేనేజేర్‌లా రేవంత్‌ ‌వ్యవహారం

– సమస్యలు పక్కన పెట్టి మెస్సీతో ఆటలా?
– కవిత ఆరోపణలపై విచారణ జరిపించాలి
– బండి పిఆర్‌వో పోస్టుపై ఈటల ఆగ్రహం

హనుమకొండ, ప్రజాతంత్ర, డిసెంబరు 13 : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈవెంట్‌ ‌మేనేజర్‌లా వ్యవహరిస్తున్నారని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ ‌విమర్శించారు. ప్రజా సమస్యలు పక్కన పెట్టి మెస్సితో ఫుట్‌బాల్‌ ఆడుతున్నారని మండిపడ్డారు. సింగరేణిలో క్వార్టర్లు బాగు చేయడానికి, సిబ్బందికి జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు. కానీ సింగరేణి డబ్బులు రూ.100 కోట్లు పెట్టి ఫుట్‌బాల్‌ ‌మ్యాచ్‌ ఆడుతున్నారు. పేదల ఇళ్లను కూలుస్తున్న హైడ్రా.. పెద్దల కబ్జాను పట్టించుకోవడం లేదు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత చేసిన ఆరోపణలపై ప్రభుత్వం విచారణ చేపట్టాలని డిమాండ్‌ ‌చేశారు. హనుమకొండ జిల్లా కమలాపూర్‌ ‌మండల కేంద్రంలోని తన నివాసంలో ఆయన డియాతో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గుర్తులు ఉండవు. ఈ ఎన్నికలంటేనే అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయి. అధికారంలో ఉన్నప్పటికీ కాంగ్రెస్‌ ‌పార్టీ 50 శాతం కూడా గెలవలేదు. గెలిచిన వారిని తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తోంది. ప్రజలకు ఆ పార్టీ పట్ల ఎంత విముఖత ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవాలని ఈటల రాజేందర్‌ అన్నారు. కేంద్రమంత్రి బండి సంజయ్‌ ‌కుమార్‌ ‌పీఆర్వో సోషల్‌ ‌డియాలో పెట్టిన పోస్టుపై ఈటల రాజేందర్‌ ‌సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను బీజేపీ ఎంపీనని… తాను కూడా కొన్ని పోస్టులను చూశానని ప్రస్తావించారు. అవగాహన లేకుండా కొంతమంది తనపై కుట్ర పూరితంగా పోస్టులు పెడుతున్నారని మండిపడ్డారు. అయితే వాటిని తాను పట్టించుకోనని స్పష్టం చేశారు. అవగాహన ఉన్నవారు అలా పోస్టులు పెడతారా..? అని ప్రశ్నల వర్షం కురిపించారు. తాను ఏ పార్టీలో ఉండాలో ప్రజలు తేల్చుకుంటారని చెప్పుకొచ్చారు. ఈ అంశాలను బీజేపీ హై కమాండ్‌ ‌తేలుస్తుందని.. సమయమే ఇది డిసైడ్‌ ‌చేస్తుందని వ్యాఖ్యానించారు. తనపై ఎవరు ఏమి చేస్తున్నారు.. ఎవరేం చెబుతున్నారో ప్రజలకు అర్థమవుతోందని తెలిపారు. సందర్భం వచ్చినప్పుడు అన్ని విషయాలు చెబుతానని అన్నారు. రెండు, మూడో విడత పంచాయతీ ఎన్నికలు పూర్తి అయ్యాక ఇటీవల జరిగిన పరిణామాలన్నీ తాను చెబుతానని ఈటల రాజేందర్‌ ‌పేర్కొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *