కేసీఆర్‌ చేసిన అభివృద్ధి రేవంత్‌కు కనపడ్డంలేదా?

– మాజీ మంత్రి హరీష్‌రావు

పటాన్‌చెరు, ప్రజాతంత్ర, నవంబర్‌ 7: నిన్న మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఇక్కడికి వస్తే కుర్చీలు ఖాళీ ఉన్నాయి.. అదే మన మీటింగ్‌కు మూడుసార్లు కుర్చీలు తెప్పించినా సరిపోవడం లేదు అని మాజీ మంత్రి హరీష్‌రావు అన్నారు. కొల్లూరు కేసీఆర్‌ నగర్‌ డబుల్‌ బెడ్‌రూమ్‌ కాలనీ వాసుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. ఇక్కడ డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లకు కేసీఆర్‌ నగర్‌ అనే పేరు పెట్టుకున్నామని, ఇన్ని ఇళ్లు చూసి అబ్బ కేసీఆర్‌ ఇంత పెద్ద ఇల్లు కట్టాడా అని మంత్రి ఉత్తమ్‌ శ్చర్యపోయారట అని వ్యాఖ్యానించారు. ఇన్ని రోజులు ఇక్కడికి మంత్రులు వచ్చారా అని ప్రశ్నించారు. మాగంటి గోపీనాథ్‌ భార్య కన్నీళ్లు పెట్టుకుంటే కాంగ్రెస్‌ నాయకులు దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారు.. మీ కాంగ్రెస్‌ వాళ్ళు చనిపోతే భార్యలు ఏడుస్తారా లేదా.. ఆ తల్లిని పట్టుకుని దుర్మార్గంగా మాట్లాడారు. ఆలోచించండి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. అది ఇస్తాం.. ఇది ఇస్తాం అని ప్రలోభాలు పెడుతున్నారన్నారు. అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోతమా? కలలో కూడా కలగనని ఇళ్లలో ఉంటామని అనుకోలేదు. మీ ఓట్లు ఖాయంగా కేసీఆర్‌కే అని అర్థమయ్యింది. మీ బంధువులకు కూడా చెప్పి కేసీఆర్‌కు కారుకు ఓటెయ్యమని చెప్పండి అని విజ్ఞప్తి చేశారు. ఈ ఎన్నికలు రెఫరెండం అని చెప్పే ధైర్యం రేవంత్‌ రెడ్డికి లేదన్నారు. మంత్రులు జూపల్లి కృష్ణారావుకు, పొన్నం ప్రభాకర్‌కు జూబ్లీహిల్స్‌ ఓటర్లు చుక్కలు చూపించారన్నారు. ఓటుకు రూ. 3 వేలు ఇస్తామని కాంగ్రెస్‌ చెబుతున్నది. తీసుకుని మిగతా రెండేళ్లలో ఇస్తామన్న డబ్బులు కూడా అడగండి అన్నారు. బిడ్డా.. కల్యాణలక్ష్మి, కేసీఆర్‌ కిట్‌ ఇచ్చాము.. రేవంత్‌ రెడ్డికి కేసీఆర్‌ చేసిన అభివృద్ది కనపడటం లేదంటే ఆయన విజ్ఞతకే వదిలేస్తా అన్నారు. రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌లో ఒక్క ఇల్లు కూడా కట్టలేదు.. గతంలో కిరాయి ఇళ్లలో ఏ పనులు కూడా చేసుకోలేని దుస్థితి ఉండేది. ఆత్మగౌరవంతో కేసీఆర్‌ పెద్ద ఎత్తున ఇల్లు కట్టించాడు.. ంవంత్‌ రెడ్డి ఇల్లు కట్టకపోగా ఉన్న ఇండ్లను కూల్చాడు. కసీఆర్‌ ముస్లింలను మోసం చేయలేదు.. సహాయం చేశాడు. ముస్లింలు సహాయం చేసిన వారిని జీవితంలో మర్చిపోరు.. హిందూ అయినా, ముస్లిం అయినా కేసీఆర్‌కు ఒక్కటేనన్నారు. సీఎం రేవంత్‌ రెడ్డి ధరలు పెంచి కమీషన్లు దండుకున్నాడు. కాంగ్రెస్‌ లేకపోతే ముస్లింలు లేరు అని రేవంత్‌ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై యావత్‌ తెలంగాణ ముస్లింలకు క్షమాపణ చెప్పాలన్నారు. 11వ తేదీన జరిగే జూబ్లీహిల్స్‌ ఎన్నిక పోలింగ్‌లో కారు గుర్తుపై ఓటు గుద్దితే కాంగ్రెస్‌ వాళ్లు కనుమరుగు కావాలె అని హరీష్‌ రావు అన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *