– కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
న్యూదిల్లీ, ప్రజాతంత్ర, డిసెంబర్ 2: హిందూ దేవతలను అవహేళన చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అహంకారపూరితంగా మాట్లాడిన మాటలను కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి తీవ్రంగా ఖండిరచారు. ఒక హిందువుగా ఉంటూ హిందువుల మీద, దేవతల మీద రేవంత్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం శోచనీయమన్నారు. ఇటీవలే జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో కూడా ఓట్ల కోసం దిగజారి కాంగ్రెస్ అంటే ముస్లింలు – ముస్లింలు అంటే కాంగ్రెస్ అంటూ రేవంత్ రెడ్డి మాట్లాడారని గుర్తు చేశారు. బహుశా, ఎంఐఎం సహవాస దోషం వల్లే రేవంత్ రెడ్డి హిందువుల మీద, దేవీదేవతల మీద బరితెగించి మాట్లాడుతున్నట్లున్నారని వ్యాఖ్యానించారు. తెలంగాణలో కూడా హిందువులంతా ఏకమై హిందువుల శక్తి ఏంటో రేవంత్ రెడ్డికి, యావత్ కాంగ్రెస్ పార్టీకి తెలియజేయవలసిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. ఏ ఓట్లతో అధికార పీఠమెక్కి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారో ఆ ఓట్లతోనే రేవంత్ రెడ్డికి, ఆయన పార్టీకి పట్టిన మైకాన్ని, అహంకారాన్ని వదిలించాలన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




