– మండిపడ్డ బిఆర్‌ఎస్ నేత కెటిఆర్
హైదరాబాద్,ప్రజాతంత్ర,సెప్టెంబర్26: సిఎం రేవంత్ వైఖరి వల్లే ఎల్ అండ్ టి మెట్రోను వొదులుకుందని బీఆర్ ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటిఆర్ అన్నారు. అనేక కష్టాలు ఎదుర్కొని ఎల్ అండ్ టీ మెట్రోను నడిపింది. దాని నిష్క్రమణ రాష్ట్ర ప్రభుత్వానికి మాయని మచ్చ. పెట్టుబడిదారులను సాక్షాత్తూ ముఖ్యమంత్రే బెదిరిస్తున్నారు. నియంతలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ మెట్రోకు మంచి డిమాండ్ ఉండేదని, తాము దిగిపోయే నాటికి దేశంలోనే రెండో అతిపెద్ద వ్యవస్థగా ఉందని ఆయన అన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడే ఎయిర్‌పోర్టు మెట్రోకు కూడా శంకుస్థాపన చేసినట్లు చెప్పారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో వైఎస్‌ఆర్ ఓఆర్‌ఆర్ నిర్మించినప్పుడు ఒక మంచి పని చేశారని, రోడ్డు పక్కన కొంత భూమిని అదనంగా వదిలారని చెప్పారు. 400 కి.మీ మేర మెట్రో విస్తరణకు కేసీఆర్ ప్రణాళికలు రచించారని, దశలవారీగా మెట్రో విస్తరణకు గతంలో కేబినెట్ ఆమోదం తెలిపిందని వెల్లడించారు. అధికారంలోకి రాగానే రేవంత్‌రెడ్డి అనాలోచితంగా ఎయిర్‌పోర్టు మెట్రోను రద్దు చేశారు.. ఆయన తలచుకుంటే ఇప్పటికే ఎయిర్‌పోర్టు మెట్రో పూర్తయ్యేది.. భూసేకరణ ఇబ్బంది కూడా లేదు.. ఎయిర్‌పోర్టు మెట్రో కొనసాగించాలని ఎల్ అండ్ టీ కోరింది.. అందుకు రేవంత్‌రెడ్డి ఒప్పుకోలేదు.. అప్పటి నుంచే సీఎం, ఎల్ అండ్ టీ మధ్య గొడవ మొదలైంది.. రేవంత్‌రెడ్డి వల్ల ఆ సంస్థ చాలా ఇబ్బంది పడింది.. ఆయన వైఖరి వల్లే ఆ సంస్థ వెళ్లిపోతోంది అని కెటిఆర్ ఆరోపించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





