నవీన్‌ విజయం.. ధ్రువీకరణ పత్రం అందజేత‌

– ప్రశాంతంగా ముగిసిన జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక కౌంటింగ్‌ 

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 14: జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక కౌంటింగ్‌ నగరంలోని కోట్ల విజయ భాస్కర్‌ రెడ్డి ఇండోర్‌ స్టేడియంలో శుక్రవారం ప్రశాంతంగా ముగిసింది. రిటర్నింగ్‌ అధికారి ఆధ్వర్యంలో సాగిన ఓట్ల లెక్కింపు ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్‌.వి.కర్ణన్‌ పర్యవేక్షించారు. అదనపు కమిషనర్‌ హేమంత్‌ కేశవ్‌ పాటిల్‌, జోనల్‌ కమిషనర్లు అపూర్వ్‌ చౌహాన్‌, హేమంత్‌ సహదేవ్‌ రావులు కౌంటింగ్‌ సజావుగా జరిగేలా సమన్వయం చేశారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ను ప్రారంభించి 10 రౌండ్లలో ముగించారు. ఎన్నికల సాధారణ పరిశీలకుల సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌ గెలిచినట్లు రిటర్నింగ్‌ అధికారి పి సాయిరాం ప్రకటించారు. విజేతకు రిటర్నింగ్‌ అధికారి గెలుపు ధ్రువీకరణ పత్రం అందజేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా స్టేడియం పరిసరాల్లో పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *