పోలీసు అధికారులుగా సేవ‌లు చిర‌స్మ‌ర‌ణీయం

– వ‌ర్ధ‌న్న‌పేట ఎమ్మెల్యే నాగ‌రాజు

వ‌రంగ‌ల్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 8ః సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం జీవితాంతం అంకితభావంతో సేవలందించిన విశ్రాంత పోలీసు అధికారుల సేవలు చిరస్మరణీయమని వ‌ర్ధ‌న్న‌పేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కె.ఆర్‌.నాగ‌రాజు అన్నారు. విధి నిర్వహణలో ప్రజల భద్రతకే ప్రథమ ప్రాధాన్యం ఇచ్చిన పోలీసు అధికారులు సమాజానికి ఆదర్శనీయుల‌ని ప్రశంసించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా విశ్రాంత పోలీసు అధికారుల సంక్షేమ సంఘం నూతన సంవత్స డైరీని ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డితో క‌లిసి గురువారం ఆవిష్కరించారు. తొలుత మరణించిన పోలీస్ అధికారులకు 2 నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం పోలీస్ సంక్షేమ  సంఘం సభ్యులకు హెల్త్ కార్డులు పంపిణీ చేసి డైరీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ  విశ్రాంతి అనంతరం కూడా సంఘాల ద్వారా ఐక్యంగా ఉంటూ సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుండడం అభినందనీయమ అన్నారు. అలాగే నూతన సంవత్సరం విశ్రాంత పోలీసు అధికారులందరికీ ఆరోగ్యం, సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు అందించాలని ఆకాంక్షించారు. విశ్రాంత పోలీస్ అధికారుల సంక్షేమ సంఘానికి రూ.5 లక్షలు విరాళం అందజేస్తామ‌న్నారు. అదేవిధంగా సంఘానికి భవన స్థలం కోసం స్థానిక ఎమ్మెల్యే ద్వారా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మీరంతా త‌న కుటుంబ సభ్యులని, మీకు ఏ అవసరాలు ఉన్నా త‌న‌ వంతు సహాయ సహకారాలు అందిస్తానని చెప్పారు. కార్యక్రమంలో విశ్రాంత పోలీసు అధికారుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు సంజీవ రెడ్డి, సంఘం ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *