ప్రభుత్వంపై విశ్వాసం నింపిన ఫలితాలు

– 75 శాతం స్థానాల్లో గెలుపు ఆషామాషీ కాదు
– ప్రజల ఆకాంక్షలను గౌరవిస్తాం

– పిసిసి చీఫ్ మహేష్ కుమార్

నిజామాబాద్.ప్రజాతంత్ర, ఫిబ్రవరి 13: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాం గ్రెస్ ఘనవిజయం సాధించడం ద్వారా మరోమారు సత్తా చాటిందని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. మెజారిటీ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కాంగ్రెస్ గెలుపొందిన క్రమం లో పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. శుక్రవారం నిజామాబాద్ పార్టీ ఆఫీసులో ఏర్పాటు. చేసిన డియా సమావేశంలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరాయని.. అందుకే మున్సిపల్ ఎన్నికల్లో 75 శాతం స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకుందని అన్నారు. మొన్నటి సర్పంచ్ ఎన్నికల్లో గెలిపించిన ప్రజలు మళ్ళీ ఈ ఎన్నికల్లోనూ గెలిపించారని.. మంత్రులు, నేతలు, కార్యకర్తల కృషితో 75 శాతం మున్సిపల్ ఎన్నికల్లో గెలిచామని అన్నారు. ప్రతిపక్షం ఎన్ని విమర్శలు, వెటకారాలు మాట్లాడిన ప్రజలు కాంగ్రెస్ ని ఆదరించారని అన్నారు. బిజెపి, బిఅరెస్, ఇంకా అన్నీ పార్టీలు కలిసి కనీసం 25 శాతం కూడా గెలవలేదని ఎద్దేవా చేశారు మహేష్ కుమార్ గౌడ్. నిజమాబాద్, కరీంనగర్ కార్పొరేషన్లో మత విద్వేషాలు రెచ్చగొట్టి బిజెపి, ఎంఐఎం పార్టీలు లబ్దిపొందాయని అన్నారు.సీఎం రేవంత్, మంత్రులు కలిసి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలిస్తున్నామని అన్నారు. సన్నబియ్యం, ఉచిత బస్సు, కరెంట్ ప్రజలకు అందుతున్నాయని.. వచ్చే జీహెచ్ఎంసి ఎన్నికల్లోనూ గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో జరిగే ఎంపిటిసి, జెడ్పిటిసి ఎన్నికల్లో కూడా గెలుస్తాంమని అన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి రెండో సారి అధికారంలోకి వస్తామని..ని జమాబాద్ కార్పొరేషన్ లో 28 సీట్లు గెలుస్తామని ఆశించాం.. కానీ అలా జరగలేదని అన్నారు. ఎన్నికల్లో ఎంఐఎంకి దూరంగా ఉన్నామని.. అభివృద్ధి కోసం ఏదయినా కఠిన నిర్ణయం తీసుకుం టానని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *