– ప్రజలకు ఇప్పుడు నిజమైన పాలన ఏంటో అర్థమైంది
– కేసీఆర్ పాలనే బాగుందంటున్నారు
– పీఆర్సీ చెల్లించి ఉద్యోగులను గౌరవించాం
– ఇప్పుడు ప్రశ్నించే గొంతులపై దాడి జరుగుతోంది
– మాజీ మంత్రి హరీష్ రావు
సిద్దిపేట, ప్రజాతంత్ర, జనవరి 26: రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మన సిద్దిపేటకు ఒక ప్రత్యేకత ఉంది. అది మన సొంత ఎన్జీవో భవన్. గత 22 సంవత్సరాలుగా ప్రతి గణతంత్ర దినోత్సవం, ఉపాధ్యాయ దినోత్సవం నాడు ఉత్తమ ఉద్యోగులను, పదవ తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను స న్మానించుకోవడం ఒక సంప్రదాయంగా వస్తోంది. ఈ వేడుకల్లో ప్రతీ సంవత్సరం పాల్గొనడం నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుందని బీఆర్ఎస్ నేత హరీష్రవు అన్నారు. గణతంత్ర దినోత్స వం సందర్భంగా సిద్దిపేటలోని టీఎన్జీవో భవన్ లో నిర్వహించిన ఉత్తమ ఉద్యోగుల సన్మాన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మంచి ఉద్యోగులను, ఉపాధ్యా యులను గౌరవించడం అంటే ఈ సమాజాన్ని గౌరవించడమే. మంచిని ప్రేమించడం, దానిని కొనసాగించే ప్రయత్నం చేయడమే మన లక్ష్య మన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండేళ్ల రెండు నెలలు దాటింది. ఇప్పుడు ప్రజలకు నిజమైన పాలన అంటే ఏమిటో అర్థమైంది. కేసీ ఆరే బాగుండేవారు అని ప్రజలందరూ నేడు గుర్తు చేసుకుంటున్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఒకసారి 42%, మరోసారి 30% చొప్పున మొత్తం 72% పీఆర్సీ ఇచ్చి ఉద్యోగులను గౌర వించుకుంది. నేడు ఉద్యోగ సంఘాల నాయకు లు కనీసం పీఆర్సీ గురించి అడిగే పరిస్థితి లేదు. మాట్లాడినా, ప్రశ్నించినా ఏసీబీ దాడుల తో ప్రభుత్వం భయపెడుతోంది. విద్యార్థులు ఫీజు రీఎంబర్స్ మెంట్ బకాయిలు అడిగితే కాలేజీలపై విజిలెన్స్ దాడులు, ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే సిట్ నోటీసులు ఇస్తూ ప్రజాస్వామ్యంపై దాడి చేస్తున్నారు.
ఈ రెండేళ్ల కాలంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం రూ.95 వేల కోట్ల కాంట్రాక్టులకు టెండర్లు పిలిచి అవార్డు చేసింది. సుమారు రూ30 వేల కోట్ల కమీషన్ల కోసం బడా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించారు. రేవంత్ రెడ్డి దగ్గర డబ్బులు లేక కాదు. ఇచ్చే మనసు లేకనే ఉద్యోగులకు బకాయిలు ఇవ్వడం లేదు. మూసీ సుందరీకరణకు రూ.లక్ష కోట్లు, ఫ్యూ చర్ సిటీకి రూ.లక్ష కోట్లు, హ్యామ్ రోడ్ల కోసం రూ.15 వేల కోట్లు, గోదావరి నీళ్ల మళ్లింపునకు రూ.8 వేల కోట్లు, ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల కోసం రూ.20 వేల కోట్లు వెచ్చిస్తున్న ప్రభుత్వం.. ఉద్యోగుల దగ్గరకు వచ్చేసరికి డబ్బులు లేవని చెప్పడం హాస్యాస్పదం. ఐదు డీఏలు, పీఆర్సీ, జిపిఎఫ్ పైసలు పెండింగ్లో ఉన్నాయి. రిటైర్డ్ ఉద్యోగులకు ఏడాది గడిచినా డబ్బులు రావడం లేదు. ఒకటో తారీకు జీతం వెనుక ఉన్న మతలబు నేను ఫైనాన్స్ మినిస్టర్గా చేశాను కాబట్టి నాకు తెలుసు, బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆర్బీఐ ఓవర్ డ్రాఫ్ట్ పరిమితి రూ.1400 కోట్లు ఉంటే ఇప్పుడు దానిని రూ.2400 కోట్లకు పెంచారు. ఆ పెంచిన రూ.2400 కోట్లు తీసుకునే ఒకటో తారీకు జీతాలు ఇస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో 18,000 మంది ఉద్యోగులు రిటై ర్ అయితే నెల రెండు నెలల్లోనే అన్ని బెనిఫిట్లు ఇచ్చాము. కానీ నేడు కమిషన్లు ఇస్తే తప్ప రిటైర్డ్ ఉద్యోగులకు పైసలు వచ్చే పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డి వల్ల రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ మార్కెట్ మొత్తం తిరోగమనంలో పడింది. ప్రజ లు అవసరానికి ప్లాట్లు అమ్ముకుందామన్నా కొనే నాథుడు లేదు. కేసీఆర్ రాష్ట్ర ప్రతిష్టను, ఆదాయాన్ని పెంచితే, రేవంత్ రెడ్డి అద్భుతమైన రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టి దివాలా తీయి స్తున్నారు. కేసీఆర్ హయాంలో రైతుబంధు, కరెంట్, డీఏలు ఎప్పుడూ ఆగలేదు. నేడు సిద్దిపే టపై ఈర్ష్యతో వెటర్నరీ కాలేజీ, వెయ్యి పడకల ఆసుపత్రి, నర్సింగ్ కాలేజీ పనులను అడ్డుకుం టున్నారు. 10 ఏళ్లలో సిద్ధిపేటను 20 ఏళ్లు ముందుకు తీసుకుపోతే, కాంగ్రెస్ పాలన లో సిద్దిపేట అభివృద్ధి వెనక్కి నెట్టేయబడుతున్నది. ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం పోరాడుతామన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





