– కూల్చివేతలు చేస్తూ నీతులు మాట్లాడుతున్నావు
– నాలుగుసార్లు గెలిచా.. ప్రతిపక్ష నేతలను ఇబ్బందిపెట్టలేదు
– బీఆర్‌ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు వినయ్ భాస్కర్
హనుమకొండ, ప్రజాతంత్ర, జనవరి 29: వరంగల్ భద్రకాళి గుడి దగ్గర గుడిసెలు వేసుకున్న పేదల ఇండ్లు, మా కార్యకర్తల షాపులు కూలగొట్టే నీచ సంస్కృతి ఎక్కడిది అని ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌ను మాజీ ఎమ్మెల్యే, బీఆరఎస్ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ నిలదీశారు. హనుమకొండలోని పార్టీ కార్యాలయమంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తాను నాలుగుసార్లు గెలిచినా ప్రతిపక్ష నాయకుల జోలికి వెళ్ళలేదని, ప్రజల ఆకాంక్ష కోసం పదవులు వదులుకున్నా.. పోరాటాలు చేసినా అని చెప్పారు. కానీ నీవు అధికార బలుపుతో పోలీసులకు పోస్టింగుల ఆశ చూపి వారితో తమవారిపై కేసులు నమోదు చేస్తూ దౌర్జన్యం చేపిస్తున్నావని ఆరోపించారు. నేను నీకు ఛాలెంజ్ చేస్తున్న.. నేను నియోజకవర్గంలో ఉండొద్దు అని నువ్వు అనుకుంటే జాతర అయ్యాక రాజీనామా చేసి గెలువు.. నేను ఓడిపోతే శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పుకుంటా.. నాకు మా నాయకుల మీద, కార్యకర్తల మీద నమ్మకం ఉంది కనుకనే నేను రాజీనామా చేసి గెలిచినా.. నీకు పార్టీ మీద, నీ అభివృద్ధి మీద నమ్మకం ఉంటే రాజీనామా చేసి పోటీ చేసి గెలువు అని సవాల్ చేశారు. బీఆరఎస్ హయాంలో దళితబంధులో అవినీతి జరిగింది అంటున్నవ్.. నిరూపించు అని సవాల్ చేశారు. నువ్వు, నీ చెంచాలు ఇందిరమ్మ ఇండ్లలో స్కీమ్‌ల పేరిట స్కాంల గురించి నీ కార్యకర్తలు చెప్తున్నారు.. మా పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో అన్నీ నెరవేర్చినం.. మీలాగా కాదు..అని అన్నారు. నా రాజకీయ జీవితం తెరిచిన పుస్తకం వంటిదన్నారు. కాళోజి కళాక్షేత్రానికి రంగులు వేసి నేను కట్టిన అని చెప్తున్నాడు.. ఇదేనా నీ పని.. రూ.250 కోట్లతో జీవోలు తెచ్చి పనులు చేస్తే బిల్లులు ఇచ్చి పనులు చేశామని అంటే ఎలా అని ప్రశ్నించారు. కనీసం ప్రజల అవసరాలు తీర్చలేని దద్దమ్మవు నీవు.. భద్రకాళి మాడవీధులకు రూ.30 కోట్లు తెచ్చింది ఎవరు.. నిధులు తెáచ్చినపుడు నువు టూర్‌లలో ఉన్నవేమో.. అభివృద్ధి పేరుతో భద్రకాళి చెరువు మట్టి అమ్మటం కాదు అని ఎద్దేవా చేశారు. భద్రకాళి చెరువు పనులు సకాలంలో పూర్తి చేస్తే వర్షపు నీరు అందులోకి వెళ్ళేది.. పనులు పూర్తి కానందున హన్మకొండ, వరంగల్ మునిగేలా చేశావు.. వందలాదిమంది ఇబ్బంది పడ్డారు, లక్షలాది ఆస్తి నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక భద్రకాళి అభివృద్ధి అంటావు, చెరువు మట్టి లోతు చెప్పినదానికన్నా తక్కువ తీస్తే ఎక్కువ తీశారÁని కాంట్రాక్టర్లకు దొంగ బిల్లులు ఇప్పించి దగ్గర డబ్బులు తీసుకున్నావ్ అని ఆరోపించారు. నీ పరిపాలన, నీ చేష్టలకు ప్రజలు నెత్తీనోరు కొట్టుకుంటున్నారు. అభివృద్ధి అంటే మేము కట్టిన కట్టడాల దగ్గర శిలాఫలకాలు కూలగొట్టుడు కాదు అని అన్నారు. దళితులు భద్రకాళి వద్ద బండ కొట్టి కొట్టుకొని గుడిసెలు వేసుకుంటే వాళ్ళ ఇండ్లు కూలగొట్టే ప్రయత్నం చేస్తున్నావ్.. దళితుల షాపులు కూలగొడుతున్నావ్.. మేము విడుదల చేసిన నిధులు కూడా మీ ఖాతాలో వేసుకొని చిల్లర మాటలు మాట్లాడుతున్నావ్ అంటూ విమర్శించారు.
ఉప ఎన్నికలో గెలిచే సత్తా లేనోడివి
కార్పొరేషన్‌లో 26కు 26 గెలుస్తా అంటున్నావ్.. కార్పొరేషన్ ఎన్నికల ముందు రాజీనామా చేసి నువ్వు గెలిచి చూపించు.. ఉప ఎన్నికలో గెలిచే సత్తా లేదు గాని 26కు 26 గెలుస్తాడట అని నాయినిశ్రీద్దేశించి వ్యాఖ్యానించారు. గుడిసె వాసులకు పట్టాలు ఇచ్చేదాకా పోరాటం చేస్తూనే ఉంటాం.. దళితుల మీద దౌర్జన్యం చేసిన నీపై పోరాడుతాం అని స్పష్టం చేశారు. సమస్యలు ఉన్నప్పుడు ప్రజలు తిడతారు.. కోప్పడతారు.. సమస్య తెలుసుకుని న్యాయం చేయాలి.. అంతేకానీ వాళ్ళను తిట్టకూడదు అని హితవు పలికారు. నాలుగు రోజులకు చేస్తావా.. నాలుగు నెలలకు రాజీనామా చేస్తావా.. చెప్పు.. లేదా మున్సిపల్ ఎన్నికల ముందు చేస్తావా.. గెలిచి చూపించు అని డిమాండ్ చేశారు. అన్యాయాలు చేసి అడ్డందిడ్డం మాట్లాడతాం అంటే నీ బాగోతాలు బయటకు తీస్తామని వినయ్ భాస్కర్ హెచ్చరించారు. సమావేశంలో కార్పొరేటర్ సోదా కిరణ్, మాజీ కార్పొరేటర్లు జోరిక రమేష్, మేకల బాబురావు, నాయకురాలు పుష్ప, పశ్చిమ నియోజకవర్గ కో ఆర్డినేటర్ పులి రజనీకాంత్, నాయకులు సల్వాజి రవీందర్ రావు, ఇమ్మడి రాజు, సదాంత్, చందర్, శ్రీధర్, డా.మనోజ్, కనకరాజు, కోటిలింగం, మహమూద్, ఖలీల్ తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



