42శాతం రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం

– సుప్రీం కోర్టు తీర్పు శుభ పరిణామం
– దిల్లీలో విూడియాతో మంత్రులు భట్టి, పొన్నం

న్యూఢల్లీి, అక్టోబర్‌ 6: బీసీ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ వేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేయడం శుభ పరిణామం అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. న్యాయస్థానం తీర్పును స్వాగతిస్తున్నాం.. కాంగ్రెస్‌ పార్టీ, రాష్ట్ర ప్రభుత్వం 42 శాతం బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చే విషయంలో అన్ని రకాలుగా పోరాటాలు చేసి సాధిస్తాం.. ఇప్పటికే ప్రభుత్వం మూడు చట్టాలు, ఒక ఆర్డినెన్స్‌, ఒక జీవో ఇచ్చి బీసీ రిజర్వేషన్లు అమలు చేసేందుకు కృషి చేసింది.. ఈ కేసులో తెలంగాణ ప్రభుత్వం తరపున బలమైన వాదనలు వినిపించాం.. 42 శాతం రిజర్వేషన్లపై స్పష్టమైన వైఖరితో ఉన్నాం.. ఈ రిజర్వేషన్ల కోసం జీవో కూడా విడుదల చేశాం.. మా నిర్ణయానికి మేము కట్టుబడి ఉన్నామని తెలిపారు. సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరపున బీసీ రిజర్వేషన్ల కల్పన కోసం అభిషేక్‌ మనుసింఘ్వి వాదనలు గట్టిగా వినిపించారన్నారు. అంతకుముందు మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ల కల్పనకు సుప్రీంకోర్టు అంగీకరిస్తుందని తమకు నమ్మకం ఉందని చెప్పారు. ఇందిరా సహానీ కేసు తీర్పు ఆధారంగా తెలంగాణలో రిజర్వేషన్లు కల్పించవచ్చన్నారు. సిపెక్‌ సర్వే ద్వారా సమగ్రమైన జన గణన వివరాల ఆధారంగా రిజర్వేషన్లు కల్పిస్తున్నామని వెల్లడిరచారు. రిజర్వేషన్ల కల్పన కోసం హైకోర్టు, సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం వాదనలు వినిపిస్తుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్‌పై సుప్రీం కోర్టులో జరిగే వాదనలు సందర్భంగా తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్‌, వాకాటి శ్రీహరి కోర్టుకు హాజరయ్యారు. సుప్రీం తీర్పును మంత్రి పొన్నం ప్రభాకర్‌ స్వాగతించారు. ప్రభుత్వం 42 శాతం రిజర్వేషన్ల అమలుకు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట వ్యాప్తంగా ఇంటికి ఇంటికి సర్వే నిర్వహించామన్నారు. సబ్‌ కమిటీ ద్వారా సవిూక్షించి క్యాబినెట్‌ అనుమతి తీసుకొని దాన్ని అసెంబ్లీలో పెట్టి అన్ని రాజకీయాల పార్టీల ఏకగ్రీవ నిర్ణయంతో చట్టాన్ని గవర్నర్‌కు పంపించామని తెలిపారు. గవర్నర్‌ రాష్ట్రపతికి పంపించారన్నారు. అయితే దీనిపై కొంతమంది వ్యక్తులు కోర్టుకు వెళ్తున్నారని మండిపడ్డారు. రాష్ట హైకోర్టులో వాదనలు జరిగాయని.. ఎన్నికల నోటిఫికేషన్‌కు వెళ్లొచ్చని చెప్పారని మంత్రి వెల్లడిరచారు. హైకోర్టులో ఈకేసుపై 8వ తేదీ విచారణ జరగాల్సి ఉందని.. ఈ లోపే వారు సుప్రీంకోర్టుకు వచ్చారన్నారు. న్యాయబద్ధంగా సుప్రీంకోర్టులో వాదనలు వినిపించామని స్పష్టం చేశారు. సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశాలతో ఢల్లీి వచ్చామని మంత్రి పొన్నం ప్రభాకర్‌ పేర్కొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *