– బిజెపి చీఫ్ ఎన్.రాంచందర్ రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 8: కాంగ్రెస్ బీసీ రిజర్వేషన్లు అమలు చేయలేక బిజెపిపై, కేంద్ర ప్రభుత్వంపై నెపం నెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, బీసీలకు ఏమీ చేయని కాంగ్రెస్ నాయకులు తమ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే రిజర్వేషన్ల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారుని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు మీడియాతో మాట్లాడుతూ విమర్శించారు. వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి బీసీ సామాజిక వర్గానికి 42% రిజర్వేషన్లు నిజంగా ఇవ్వాలంటే న్యాయపరమైన ప్రక్రియను పాటిస్తూ, చిత్తశుద్ధితో మాత్రమే సాధ్యమయ్యేదన్నారు. 2018 పంచాయతీరాజ్ చట్ట సవరణ లేకుండా రిజర్వేషన్లు అమలు చేయలేంమని స్పష్టం చేశారు. ఈ సందర్భంలో గతంలో సుప్రీంకోర్టు నిర్ణయం ప్రకారం 50% క్యాప్ మించరాదు అని కూడా స్పష్టంగా తీర్పునిచ్చిందన్నారు. 22 నెలల ఆలస్యం తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం తాము చేసిన తప్పును గ్రహించి చివరికి బీజేపీ ఇచ్చిన సలహాలు, సూచనలను పరిగణనలోకి తీసుకొని, ఇటీవల అసెంబ్లీ సమావేశంలో సెక్షన్ 285 సవరణ చేసి మళ్లీ రెండోసారి బిల్లు తీసుకొచ్చిందని తెలిపారు.. కానీ, ఈ చట్ట సవరణ గతంలో ఎందుకు చేయలేదు.. ఇన్ని రోజులు ఎందుకు ఆలస్యం చేశారు.. కాంగ్రెస్ పార్టీలో కపిల్ సిబల్ వంటి అనేక న్యాయ నిపుణులు ఉన్నారు.. వారిని ఎందుకు సంప్రదించలేదు.. లేదా న్యాయపరమైన ప్రక్రియ కోసం న్యాయనిపుణుల సలహాలను ఎందుకు తీసులేదు అని ప్రశ్నించారు. కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ చేసింది బీసీ డిక్లరేషన్ కాదు.. బీసీలకు ద్రోహం. కాంగ్రెస్ పార్టీ నిజంగా చట్టబద్ధతను పాటించాలనుకున ేవాళ్లే అయితే ఎందుకు 22 నెలలు ఆలస్యం చేశారన్నారు. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల గడువు ముగిసి ఏడాదిన్నర గడిచిందని రామచందర్‌రావు తగుర్తు చేశారు. అయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక ఎన్నికలు నిర్వహించకుండా ఆలస్యం చేయడం దారుణమన్నారు. ఫ˜లితంగా 73వ, 74వ సవరణల ప్రకారం స్థానిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్రానికి రావాల్సిన సుమారు రూ.1,600 కోట్లు ఆగిపోయాయని, మొత్తంగా సుమారు రూ.3,000 కోట్ల కేంద్ర నిధులు ఆగిపోయే పరిస్థితి ఏర్పడిరదని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ భరతం పట్టడం ఖాయమని రామచందర్‌రావు హెచ్చరించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.


