ప్ర‌త్యేక అవ‌స‌రాలున్న పిల్ల‌ల త‌ల్లిదండ్రుల‌కు మిన‌హాయింపు ఇవ్వాలి

– ఎన్నిక‌ల విధుల‌పై కేంద్ర‌ మంత్రి సంజ‌య్‌కు విన‌తి

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 12: ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లల సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న తల్లిదండ్రులైన ఉపాధ్యాయులకు రానున్న మున్సిపల్ ఎన్నికల విధుల నుండి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అసోసియేషన్ తెలంగాణ (సెటా) రాష్ట్ర ప్రధానకార్యదర్శి అట్ల శ్రీనివాస్ రెడ్డి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అట్ల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలకు నిరంతర పర్యవేక్షణ, థెరపీ, మందులు, భావోద్వేగ భద్రత తప్పనిసరి అని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న పిల్లల తల్లిదండ్రులైన ఉపాధ్యాయులను ఎన్నికల విధులకు నియమించడం వల్ల పిల్లల అభివృద్ధి, ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతోందని కేంద్ర మంత్రి కి వివరించినట్లు తెలిపారు.ఈ విషయంపై మంత్రివర్యులు సానుకూలంగా స్పందిస్తూ, సంబంధిత అధికారులతో చర్చించి అవసరమైన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చినట్లు రాష్ట్ర ప్రధానకార్యదర్శి అట్ల శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో టి.పస్. జిల్లా బాధ్యులు ముదిగంటి ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *