– రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ చిన్నారెడ్డి
– షాద్‌నగర్ సాంఘిక సంక్షేమ కాలేజీని ఆకస్మికంగా తనిఖీ
– విద్యార్థినులతో కలిసి భోజనం
షాద్‌నగర్, ప్రజాతంత్ర, నవంబర్ 3: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లోని నాగర్ కర్నూల్ సాంఘిక సంక్షేమ శాఖ కళాశాల స్థితిగతులపై, ప్రిన్సిపాల్ వ్యవహారంపై సమగ్రంగా నివేదికను ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డికి త్వరలోనే అందించనున్నట్లు ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్, సీఎం ప్రజావాణి ఇన్‌చార్జి డాక్టర్ జి.చిన్నారెడ్డి తెలిపారు. ఈ సాంఘిక సంక్షేమ శాఖ కాలేజిని చిన్నారెడ్డి సోమవారం ఆకస్మికంగా సందర్శించారు. ప్రిన్సిపాల్ వైఖరిని నిరసిస్తూ నిన్న 400 మంది విద్యార్థినులు ఆందోళనకు దిగిన నేపథ్యంలో చిన్నారెడ్డి గురుకుల కాలేజీని సందర్శించారు. విద్యార్థినుల పట్ల కళాశాలలో ప్రిన్సిపాల్ శైలజ ప్రవర్తించిన తీరును, ఇతర వివరాలు సిబ్బంది, విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. కాలేజీ ప్రాంగణం అంతా కలియతిరిగారు. వాష్ రూమ్స్, తరగతి గదులు అధ్వానంగా ఉన్న విషయాన్ని, ఇతర సమస్యలు సీఎంకు ఇచ్చే నివేదికలో ప్రస్తావిస్తానని చిన్నారెడ్డి తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




